Kapu community split: ఏపీలో ( Andhra Pradesh) కుల రాజకీయం నిత్యం రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది. అలా ఉంటేనే రాజకీయ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో కాపుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఇందులో విశేషం ఏమిటంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కాపు కులం గురించి పట్టించుకోని నేతలు.. ఇప్పుడు అదే కాపు రాజకీయాన్ని రగిల్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయం కోసం.. అదే కాపులను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాపులను చీల్చితేనే అధికారం దక్కుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ కాపు నేతలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ అదే. మొన్నటి ఎన్నికల్లో కాపులను వదులుకొని ఎంత తప్పు చేశానో అని జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నారు. ఇప్పుడు వారిని చీల్చడమే పనిగా పెట్టుకున్నారు.
నిర్మొహమాట కామెంట్స్..
తాను ఎప్పుడూ కాపుల రాజకీయం చేయలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) చాలా సందర్భాల్లో చెప్పారు. నాకు కుల భావన లేదని కూడా తేల్చి చెప్పారు. తనకు కాపులు ఓట్లు వేయలేదని కూడా అన్నారు. అసలు కాపులతో తనకు పని లేదన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు నడిరోడ్డుపై పోలీసులు, మీడియా సమక్షంలో సీఎం చంద్రబాబును తిట్టారు అంబటి. దానిపై కేసులు నమోదయి జైలుకు వెళ్తే.. తాను కాపును కాబట్టే తనను అరెస్టు చేశారంటూ చెప్పుకొచ్చారు. ఒక వంగవీటి మోహన్ రంగా, ఒక మెగాస్టార్ చిరంజీవి, ఒక ముద్రగడ పద్మనాభం అంటూ అంబటి రాంబాబును ఆకాశానికి ఎత్తేసారు. జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా కాపు టైగర్ ను చేసేసారు.
Also Read: కేంద్ర రాజకీయాల్లోకి చంద్రబాబు.. అదిగో సాక్ష్యం!
తీరిన కాపుల ఆశ..
దశాబ్దాలుగా కాపులు కోరుకున్న మాదిరిగా రాజ్యాధికారానికి దగ్గరగా వచ్చారు. అది కూడా పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan dwara ) ద్వారా. ముఖ్యమంత్రికి కూత వేటు దూరంలో.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన మాట ప్రభుత్వపరంగానూ, రాజకీయంగాను చెల్లుబాటు అవుతోంది. కూటమిలో అధికారం దక్కుతోంది. ఎనలేని ప్రాధాన్యం కూడా ఇస్తున్నారు. ఇటువంటి సమయంలో కాపులు ఏకతాటి పైకి వచ్చి పవన్ కళ్యాణ్ వెంట అడుగులు వేస్తున్నారు. అందుకే ఇప్పుడు కాపుల్లో చీలిక తెచ్చి.. కొంత ఓటు బ్యాంకును జగన్ పాదాల చెంతకు చేర్చాలన్న ఆలోచనలో వైసిపి కాపు నేతలు ఉన్నారు. కానీ అది అంత సులువుగా కాదు. గత అనుభవాలను రంగరించుకొని మరి కాపులకు అన్ని విషయాలు తెలుసు. ఈసారి అంత సులువుగా మోసపోరని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.