Duvvada Madhuri audio leaked: ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలకమైన రాజకీయ నాయకులలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఆ ప్రాంతంలో కీలక నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి ఈయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. మాధురి తో సాగిస్తున్న వ్యవహారం ద్వారా దువ్వాడ శ్రీనివాస్ ఒకసారి గా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చుకున్నారు. దీనికి తోడు యూట్యూబ్ ఛానల్స్ కూడా శ్రీనివాస్, మాధురి గురించి విపరీతంగా ఇంటర్వ్యూలు చేయడంతో ఒక్కసారిగా ఆయన సెలబ్రిటీ అయిపోయారు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మాధురితో సాగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో శ్రీనివాస్ మీద అతడి మొదటి భార్య పిల్లలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి ఇంటి మీదకి కూడా వచ్చారు. ఆ సమయంలో శ్రీనివాస్ తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అప్పట్లో శ్రీనివాస్ వ్యవహారం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత శ్రీనివాస్ ను జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.. ప్రస్తుతం శ్రీనివాస్ వైసీపీ బహిష్కృత నేతగా కొనసాగుతున్నారు. మాధురితో కలిసి వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో తన అనుచరుల ఇండ్లకు వెళ్తూ.. వారు నిర్వహించుకునే కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించిన ఒక విషయం వెలుగులోకి వచ్చింది.
దువ్వాడ శ్రీనివాస్ కు కింజారపు అప్పన్న అనే ఓ అనుచరుడు ఉన్నాడు. కింజారపు అప్పన్న, మాధురితో ఓ విషయమై ఫోన్లో మాట్లాడాడు. ఆ ఫోన్ సంభాషణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్ పై దాడి చేయడానికి ప్లాన్ జరుగుతోందని అప్పన్న మాధురితో చెప్పాడు. నరసన్నపేట లేదా నిమ్మడ జంక్షన్ లో ఈ దాడి జరిగే అవకాశం ఉందని అప్పన్న మాధురి తో చెప్పాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ అర్ధరాత్రి నిమ్మడ హైవే మీద తన అనుచరులతో హల్ చల్ సృష్టించాడు. ఇలాంటి బెదిరింపులకు ఏమాత్రం తగ్గేది లేదని శ్రీనివాస్ బలమైన కౌంటర్ ఇచ్చాడు. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ఏపీ రాజకీయాలలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కూడా ఫలానా రాజకీయ పార్టీ నాకు వ్యతిరేకమని.. వారే నాకు వ్యతిరేకంగా దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించడం లేదు.
సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి
ఆడియోలో దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య సంభాషణ
శ్రీనివాస్‌పై దాడికి ప్లాన్ జరుగుతుందని చెబుతున్న అప్పన్న
నరసన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్లో దాడి జరుగుతుందన్న అప్పన్న
దమ్ముంటే కొట్టాలని అర్ధరాత్రి నిమ్మాడ హైవేపై… https://t.co/POWdIxrv5r pic.twitter.com/jKEVDGBTol
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2025