Top investment options: 2025 నుంచి 2026 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సమయంలో ఉద్యోగ, వ్యాపారులది ఒకటి ఆలోచన.. గడిచిన సంవత్సరంలో ఏం చేశాం? కొత్త సంవత్సరంలో ఏం చేయాలి? ఎలా జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవాలి? ఆర్థికంగా ఎలా ఎదగాలి? అని ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇప్పటివరకు జరిగింది గతం గతః.. కానీ ఇకనుంచి సరైన ప్లానింగ్ వేసుకోవడం వల్ల భవిష్యత్ బాగుండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలంటే సరైన ఫైనాన్స్ ప్లానింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఆ ప్లానింగ్ అనేది కొన్ని సూత్రాల ద్వారా ఏర్పాటు చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోయే వారికి ఈ రకమైన ప్లానింగ్ అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
చాలామందికి ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉండాలని ఉంటుంది. కానీ కొందరు మాత్రమే ఉన్నత స్థితిలో ఎందుకుంటారు? అన్న ఆలోచన కూడా వస్తుంది. అయితే సరైన ఫైనాన్స్ ప్లానింగ్ ఉంటే ప్రతి ఒక్కరూ మంచి పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉంది. అందుకోసం ముందుగా ఆర్థిక అవసరాలను బెరీజు వేసుకోవాలి. మనకు వచ్చే ఆదాయం ఎంత? దానిని ఎలా విభజించాలి? అనేది ప్రధానంగా నిలుస్తుంది. ఒక వ్యక్తికి ఎంత మంచి ఆదాయం ఉన్నా.. ప్లానింగ్ లేకపోతే అతడు ఎంత సంపాదించినా ఖర్చులు అవుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ అవసరాలు, జల్సాలు, విలాసాలు వంటి వాటిలో ఆ వ్యక్తికి అవసరం ఏవి? అనవసరపు ఏవి? అనేది నిర్ణయించుకొని. పెట్టుబడులు, ఖర్చులు విభజించుకోవాలి.
ఉదాహరణకు ఒక వ్యక్తి 25 నుంచి 30 ఏళ్లలోపు ఉన్నట్లయితే.. ఆ వ్యక్తి ఇప్పుడిప్పుడే డబ్బు సంపాదనకు రంగంలోకి దిగినట్లు. ఇలాంటి వ్యక్తికి డబ్బు సంపాదించడానికి చాలా టైం ఉంది. వయసు కూడా ఉంది. అందువల్ల ఈ వయసులో ఉన్న వ్యక్తి రిస్క్ తో కూడిన పెట్టుబడులను పెట్టవచ్చు. ఉదాహరణకు స్టాక్ మార్కెట్, కొత్తగా వ్యాపారం ప్రారంభించవచ్చు. అయితే నష్టం ఎదురైనా తట్టుకునే శక్తి అంటే.. బ్యాకప్ ఫైనాన్స్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లే.
మరో వ్యక్తికి 30 నుంచి 50 ఏళ్ల వరకు లోపు ఉంటే.. ఈ వ్యక్తి ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించాలి. అంటే ఇప్పటివరకు ఎన్నో రకాల జల్సాలు, ఎంజాయ్మెంట్ కోసం ఖర్చులు చేసి ఉండవచ్చు. కానీ ఇకనుంచి వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు ప్రారంభమవుతాయి. అందువల్ల పిల్లల కోసం ప్రత్యేకంగా పెట్టుబడులు ఏర్పాటు చేసుకోవాలి. మరోవైపు ఉద్యోగ భద్రత కూడా ఉండాలి కాబట్టి.. ఉద్యోగం పోయిన ఏడాది పాటు జీవించే విధంగా ఆర్థిక నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ వయసులో ఉన్నవారు రిస్కు ఉండే పెట్టుబడులు కాకుండా తక్కువ లాభం వచ్చే వాటి వైపు వెళ్ళాలి. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ వంటివి ఎంచుకోవాలి.
50 ఏళ్ల తర్వాత ఉన్నవారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ వయసులో ఉన్నవారు రిస్క్ తో కాకుండా యావరేజ్ గా లాభం వచ్చే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఉదాహరణకు ఫిక్స్డ్ డిపాజిట్ వంటి వాటిని ఎంచుకోవాలి.
ఈ విధంగా ఆయా వయసులో ఉన్నవారు తమ కుటుంబ పరిస్థితులు, ఆదాయ పరిస్థితుల ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ముందుకు వెళ్లాలి..