Homeబిజినెస్Official Google Store: అక్టోబర్ 7 వరకు అదిరిపోయే ఆఫర్లు.. ఇంతకీ ఇందులో ఏమేమీ ఉన్నాయంటే

Official Google Store: అక్టోబర్ 7 వరకు అదిరిపోయే ఆఫర్లు.. ఇంతకీ ఇందులో ఏమేమీ ఉన్నాయంటే

Official Google Store: స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నవారికి Google Store India లో ప్రస్తుతం ఆసక్తికరమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గూగుల్ తన వార్షికోత్సవ డీల్స్ లో భాగంగా pixel 11 సిరీస్ పై క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజి బోనస్, యాక్ససరి లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు అక్టోబర్ 7 వరకు కొనసాగుతాయి. Pixel 11 పై 7000 క్యాష్ బ్యాక్ కొత్తగా వచ్చిన గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ కొనుగోలు […]

Official Google Store: స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నవారికి Google Store India లో ప్రస్తుతం ఆసక్తికరమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గూగుల్ తన వార్షికోత్సవ డీల్స్ లో భాగంగా pixel 11 సిరీస్ పై క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజి బోనస్, యాక్ససరి లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు అక్టోబర్ 7 వరకు కొనసాగుతాయి.

Pixel 11 పై 7000 క్యాష్ బ్యాక్

కొత్తగా వచ్చిన గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్లు ఇస్తోంది కంపెనీ. అర్హత కలిగి ఉన్న బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా 7000 వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తోంది. ఒకవేళ మంచి కండిషన్ లో ఉన్న పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 9,000 వరకు బోనస్ పొందే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్ ఇక్కడితోనే ఆగదు. పిక్సెల్ 11 కనుక పర్ఛేజ్ చేస్తే Pixel Buds pro 2 పై ₹2,000 వరకు రాయితీ సొంతం చేసుకోవచ్చు.. అంటే ఆ ఫోన్ తో పాటు గూగుల్ ఆడియో ఎకో సిస్టం కావాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్.

Pixel 11 Pro, Pro XL పై ఇంకా ఎక్కువ

Google pixel 11 Pro లేదా pixel 11 Pro XL కొనుగోలు చేసే వారికి పదివేల వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కండిషన్ ఉన్న పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మరో 9000 వరకు ఎక్స్చేంజి బోనస్ లభిస్తుంది. అదనంగా పిక్సెల్ 11 ప్రో కొనుగోలుతో పిక్సెల్ వాచ్ పై 5000 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రో ఎక్స్ఎల్ కొనుగోలుకు కూడా గూగుల్ బండిల్ ప్రయోజనం అందిస్తుంది.

Pixel 11 Pro fold పై పదివేల క్యాష్ బ్యాక్

Foldable ఫోన్ కావాలి అనుకునే వారికి గూగుల్ స్టోర్ లో అద్భుతమైన ఆఫర్ ఉంది. పిక్సెల్ ప్రో ఫోల్డ్ పై అర్హత కలిగిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసినప్పుడు పదివేల వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 9,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. పిక్సెల్ వాచ్ 5 పై 2000 వరకు డిస్కౌంట్ వస్తుంది.

Pixel 10 పై కూడా భారీ తగ్గింపు

కొత్త pixel 11 సిరీస్ మాత్రమే కాకుండా, గత తరం pixel 10 పై కూడా Google Store India లో ఆఫర్ కొనసాగుతోంది. Pixel 10 ధర ప్రస్తుతం 74,999 రూపాయలు. దీని మీద ఐదువేల తగ్గింపు లభిస్తోంది. గతంలో దీని ధర 79,999 రూపాయలు ఉండేది. ఎక్స్చేంజ్ మీద 1000 వరకు అదనపు ప్రయోజనం పొందవచ్చు. Google స్టోర్ ప్రకారం పిక్సెల్ 10 పై డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 31, 2026 వరకు కొనసాగుతుంది. అయితే స్టాక్.. ఇతర నిబంధనలను వర్తిస్తాయి

పిక్సెల్ 11 కొనాలి అనుకునేవారు క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజి బోనస్ ఇతర విధాలను పరిశీలించవచ్చు. పిక్సెల్ 11 ప్రో లేదా ప్రో ఎక్సెల్ తీసుకోవాలి అనుకునే వారికి క్యాష్ బ్యాక్ పరంగా ఎక్కువగా ప్రయోజనం లభిస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకునే వారికి పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ పై కూడా ఇదే స్థాయిలో క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ప్రయోజనాలు లభిస్తాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper