Homeఅంతర్జాతీయంAmerica Education System: అమెరికాలో అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎందుకు చదువుతారు

America Education System: అమెరికాలో అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎందుకు చదువుతారు

America Education System: అమెరికా.. సంపన్న దేశం.. ప్రజల జీవితాలు ప్రపంచ దేశాల ప్రజలతో పోల్చి చూస్తే అత్యంత మెరుగ్గా ఉంటాయి. వారి సంపాదన ఒక స్థాయిలో ఉంటుంది. పైగా అమెరికా కరెన్సీ ప్రపంచాన్ని మొత్తం శాసిస్తూ ఉంటుంది. సంపన్న దేశం కాబట్టి అమెరికాలో ప్రజలు తమ పిల్లల్ని పేరుపొందిన కార్పొరేట్ పాఠశాలలు లేదా కళాశాలలో చదివిస్తారు అనుకుంటే పొరపాటే. అమెరికాలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని దాదాపు 90% గవర్నమెంట్ పాఠశాలలకే పంపిస్తూ ఉంటారు. చదువుతుంటే ఆశ్చర్యం […]

America Education System: అమెరికా.. సంపన్న దేశం.. ప్రజల జీవితాలు ప్రపంచ దేశాల ప్రజలతో పోల్చి చూస్తే అత్యంత మెరుగ్గా ఉంటాయి. వారి సంపాదన ఒక స్థాయిలో ఉంటుంది. పైగా అమెరికా కరెన్సీ ప్రపంచాన్ని మొత్తం శాసిస్తూ ఉంటుంది. సంపన్న దేశం కాబట్టి అమెరికాలో ప్రజలు తమ పిల్లల్ని పేరుపొందిన కార్పొరేట్ పాఠశాలలు లేదా కళాశాలలో చదివిస్తారు అనుకుంటే పొరపాటే.

అమెరికాలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని దాదాపు 90% గవర్నమెంట్ పాఠశాలలకే పంపిస్తూ ఉంటారు. చదువుతుంటే ఆశ్చర్యం అనిపించినప్పటికీ ఇది నూటికి నూరు శాతం నిజం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో స్థానిక ఆస్తి పన్నుల ద్వారా నడుస్తూ ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు వెళ్లడానికి పసుపు రంగులో ఉన్న స్కూల్ బస్సులు ఉంటాయి. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల అర్హత ఆధారంగా తక్కువ ధర లేదా ఉచితంగా అల్పాహారం.. మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉంటారు.

ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు విపరీతంగా ఉంటాయి. సామాన్య.. మధ్యతరగతి కుటుంబాలు ఆకర్షణ భరించే అవకాశం ఉండదు. అక్కడ ప్రజలు నివసించే ప్రాంతాలకు దగ్గర్లో ప్రభుత్వ పాఠశాలలో సీటు ఉచితంగానే దొరుకుతుంది. గృహాలకు దగ్గరగా ఉండటంవల్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని పర్యవేక్షించడం సులభం అవుతుంది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు కచ్చితంగా గవర్నమెంట్ సర్టిఫికేషన్.. గవర్నమెంట్ సూచించిన విద్యార్హతలు ఉండాలి. విశాలమైన ఆట స్థలాలు.. ప్రయోగ శాలలు.. కంప్యూటర్లు.. ఇతర సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా ఉంటాయి.

అమెరికన్ విద్యా విధానం భిన్నంగా ఉంటుంది. ఆయా పాఠశాలలలో ఒకే రకమైన విద్యా విధానం ఉండదు. పూర్తిగా రాష్ట్రాలు.. స్థానిక పాఠశాల జిల్లాల నియంత్రణలో ఉంటుంది. అమెరికాలో విద్యను బోధించే విధానాన్ని కె 12 అని పిలుస్తూ ఉంటారు. దీనిని మూడు భాగాలుగా డివైడ్ చేశారు. కిండర్ గార్టెన్ నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్.. ఆరవ తరగతి నుంచి 8 వరకు మిడిల్ స్కూల్.. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు హై స్కూల్ గా డివైడ్ చేశారు. రాష్ట్రాల మధ్య స్పష్టమైన తేడాలు ఉంటాయి. మెజారిటీ రాష్ట్రాలలో కామన్ కోర్ స్టేట్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు ఉంటాయి. గణితం.. సామాన్య శాస్త్రం.. ఆంగ్లం.. సాంఘిక వంటివి కోర్ సబ్జెక్టులు గా ఉంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper