Next year Telugu Movies Competition: స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ ఎప్పటికప్పుడు రసవత్తరంగా మారుతుంది. ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంటే రాబోయే సినిమాలు సైతం భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే ఈ సంవత్సరం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘దురంధర్ 2’ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది. అయితే నెక్స్ట్ ఇయర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోయే అతి పెద్ద భారీ సినిమాల మధ్య భారీ యుద్ధమే జరగబోతుంది. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ‘స్పిరిట్’ సినిమా కాగా, మరొకటి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘వారణాసి’ సినిమా కావడం విశేషం…
ఈ రెండు సినిమాలు కూడా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం మన వాళ్లు పక్కన పెట్టేసి మనమే టాప్ పొజిషన్ కి వెళ్లగలుగుతామా? లేదా అనేది తెలియాల్సి ఉంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ శాసించే స్థాయికి మన హీరోలు మన ఇండస్ట్రీ ని తీసుకెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరు మన సినిమాలను చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకులను అదరించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా సైతం నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక బాలీవుడ్ నుంచి కూడా మరికొన్ని సినిమాలైతే వస్తున్నాయి. ఇక ఈ పోటీలో ఎవరు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ‘దురంధర్ 2’ మూవీ క్రియేట్ చేస్తున్న రికార్డులను మన తెలుగు సినిమాలు బ్రేక్ చేయగలుగుతాయా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…