Pawan Kalyan: గత మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో , మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం గురించే చర్చ. కొందరు వ్యక్తిగత విషయాలపై కామెంట్ చేయడం సరికాదని సభ్యత పాటిస్తూ మౌనం వహిస్తుంటే , మరికొందరు మాత్రం ఛాన్స్ దొరికింది కదా అని పవన్ కళ్యాణ్ ని దూషిస్తూ రెచ్చిపోతున్నారు. అలా దూషించే వారిపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. దీంతో సోషల్ మీడియా లో ట్రోలింగ్ చేసే వారి సంఖ్య ఇప్పుడు కాస్త తగ్గింది. అయితే అభిమానుల్లో కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకలేదు. దీనిపై భవిష్యత్తులో అయినా క్లారిటీ వస్తుందో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ పై రాజకీయ కుట్ర జరుగుతోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు , అందుకు సంబంధించి కొన్ని కారణాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా తో విడాకులు తీసుకుంటున్నట్టు ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ వార్తని ఒక ప్రముఖ రాజకీయ పార్టీ కి సంబంధించిన మీడియా ఛానల్ ట్విట్టర్ లో ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా భగ్గుమంది, క్షణాల్లో ఈ వార్త నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత జాతీయ మీడియా కూడా ఈ వార్త ని కవర్ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా తన ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి విడాకుల విషయం లో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. అయినప్పటికీ ఈ వార్త ఎక్కడి నుండి వచ్చింది?, ఇదంతా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని తగ్గించడం కోసం ఆ రాజకీయ పార్టీ కి సంబంధించిన మీడియా చానెల్స్ చేసిన కుట్ర అంటూ అభిమానుల నుండి వినిపిస్తున్న వాదన. కానీ అభిమానులు అనుకుంటున్నట్టుగా అక్కడ ఏమి జరగలేదు. నిజంగా వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ తన పీఆర్ టీం ద్వారా ఈ సమాచారాన్ని మీడియా కి అందించాడు. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర కూడా జరగలేదనేది వాస్తవం. కానీ కొన్ని మీడియా చానెల్స్ పవన్ కళ్యాణ్ నాల్గవ పెళ్లి చేసుకోబోతున్నాడని , జనసేన సోషల్ మీడియా విభాగం లో పని చేసే ఒక అమ్మాయితో ఆయనకీ లింక్ పెడుతూ కొన్ని కథనాలు ప్రచారం చేశారు. ఇందులో కూడా ఎలాంటి నిజం లేదు. అయితే ఈ క్రమం లో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత మూడేళ్ళుగా పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడివిడిగానే ఉంటున్నారట. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్నా లెజినోవా తన పిల్లలతో కలిసి సింగపూర్ లో ఉండేది. కానీ వైసీపీ మీడియా పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య కి విడాకులు ఇచ్చేశాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం తో, అన్నా లెజినోవా ని ఇండియా కి తిరిగి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
ఇక ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక జరిగిన సంఘటనలు మొత్తం మనమంతా చూసాము. రెండు నెలల క్రితం వరకు కూడా అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ తో ఎంతో సన్నిహితంగా ఉండేది. కానీ అకస్మాత్తుగా విడిపోవడం తో అభిమానులు ఇప్పటికీ షాక్ ని నుండి తేరుకోలేదు. అయితే వాళ్ళు ఇన్ని రోజులు కలిసి ఉన్నప్పటికీ, అది కేవలం స్నేహితులుగా మాత్రమే ఉన్నారని, భార్య భర్తలుగా లేరని కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. వీళ్లిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం 2023 వ సంవత్సరం లోనే తెగిపోయింది అట. ఆ తర్వాత కూడా కలిసి జీవించేందుకు ప్రయత్నం చేశారు కానీ కుదర్లేదు. ఎన్నికల్లో గెలిచి ఏడాది సమయం ముగిసిన తర్వాత అన్నా లెజినోవా మరోసారి తన పిల్లలతో కలిసి సింగపూర్ కి వెళ్ళిపోయింది. మార్క్ శంకర్ కి అగ్ని ప్రమాదం జరిగి, అతను పూర్తిగా కోలుకున్న తర్వాత హైదరాబాద్ కి తిరిగి వచ్చేసింది.
కానీ పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా, తన సమయాన్ని మొత్తం పాలనకే కేటాయించడం తో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి అభిప్రాయం భేదాలు మొదలయ్యాయి అని, అది చిలికి చిలికి గాలివాన లాగా మారడంతో లీగల్ గా విడాకులు తీసుకున్నారని అంటున్నారు. 2023 వ సంవత్సరం లోనే వీళ్ళిద్దరూ మెంటల్ గా విడాకులు తీసుకున్నారు, కానీ ఇప్పుడు అధికారికంగా లీగల్ గా విడాకులు తీసుకున్నారు. అయితే భవిష్యత్తులో కూడా వీళ్ళు మునిపటిలాగానే మంచి స్నేహితులుగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో సాయి ధరమ్ తేజ్ పెళ్ళికి కూడా అన్నా లెజినోవా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.