Baahubali 3: రాజమౌళి ఏం చేసినా కూడా అది చాలా గ్రాండియర్ గా ఉంటుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ అంటూ ఒక వీడియో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియో రావడానికి ముందు సినిమా యూనిట్ నుంచి ఒక అఫీషియల్ వీడియో అయితే రిలీజ్ అయింది. అది ఏంటి అంటే బాహుబలి 3 ఉంటుంది అంటూ సినిమా యూనిట్ మొత్తం చాలా స్పష్టంగా చెప్పారు.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి 3 సినిమా ఉంటే మాత్రం దానిని డిఫరెంట్ గా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడట. వారణాసి తర్వాత ‘బాహుబలి 3’ ని పట్టాలెక్కించే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ కథను కూడా రెడీ చేసి పెట్టాడట. అయితే ఈ సినిమా కోసం దాదాపు 2500 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించే అవకాశాలైతే ఉన్నాయట.
దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం తీసుకొని మరి ఈ సినిమాని తెరకెక్కించాలని రాజమౌళి చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ఈ సినిమాకి అంత మొత్తంలో బడ్జెట్ పెడితే మాత్రం ఆ సినిమా దాదాపు 5000 నుంచి 6000 కోట్ల వరకు కలెక్షన్స్ ని ఈజీగా రాబడుతుంది అని ట్రేడ్ పండితులు సైతం అంచనాలు వేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి దినదిన అభివృద్ధి చెందుతున్నాడు. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు.
ఇది చూసిన చాలా మంది అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే సినిమా ఇండస్ట్రీ ఇంకాస్త బాగుపడుతుందని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మనల్ని ఢీకొట్టే వారు ఎవరు ఉండరు అని ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు సైతం మనం చాటి చెప్పవచ్చు అంటూ మరి కొంతమంది విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…
