నటీనటులు: తేజ సజ్జా, ఆనందీ, దక్ష నగర్కర్, రఘు బాబు, గెటప్ శ్రీను, హర్షవర్ధన్, హేమంత్, హరి తేజ.
దర్శకుడు: ప్రశాంత్ వర్మ
నిర్మాత: రాజ్ శేఖర్ వర్మ
సంగీతం: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ: అనిత్
ఎడిటింగ్: సాయి బాబు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాంబి రెడ్డి’. కాగా ‘జాంబి జోనర్లో వచ్చిన తొలి తెలుగు సినిమా కూడా ‘జాంబి రెడ్డి’నే. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో వెళ్లి తెలుసుకుందాం.
Also Read: ఏ.ఎం.రత్నం గారిని మాత్రమే సినిమా అడిగాను: పవన్ కళ్యాణ్
కథ :
విష ప్రయోగాల వల్ల వచ్చే జాంబీ వైరస్ వస్తే.. ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు అనే యాంగిల్ లో సాగింది ఈ కథ. మ్యారియో (తేజ సజ్జా) తన టీమ్ తో ఒక గేమ్ డిజైన్ చేస్తాడు. తన టీంలో మెంబర్ కర్నూలులో పెళ్లి చేసుకుంటూ ఉండగా.. హీరో తన టీమ్ తో కర్నూలుకి వెళ్తాడు. అక్కడ హీరో అండ్ హీరో టీమ్ జాంబిల బారిన పడతారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అందరూ జాంబిలుగా మారి హీరో టీం పై దాడికి దిగుతారు. చివరకు హీరో అక్కడ నుండి ఎలా బయట పడ్డాడు ? అలాగే ఆ జాంబిలను తిరిగి మళ్లీ మాములు మనుషులుగా ఎలా మార్చాడు ? అసలు జాంబి అంటే ఏమిటి ? అది ఎలా పుట్టింది ? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ :
‘జాంబి రెడ్డి’ రెగ్యులర్ హారర్ ఫిల్మ్ లా కాకుండా మంచి థీమ్ తో తెరకెక్కింది. ముఖ్యంగా సినిమాను కొత్త ప్లేతో తీయడం, సినిమాలో కొన్ని హారర్ ఎఫెక్ట్స్ బాగుండటం, అలాగే క్లైమాక్స్ లో జాంబి యాక్షన్ హైలైట్ అవ్వడం వంటి అంశాలు జాంబి రెడ్డికి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుందనుకుంటుండగా దర్శకుడు ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలలతో కాసేపు జాంబి జోనర్ టచ్ చేసి సినిమాని నిలబట్టే ప్రయత్నం చేసాడు. ఇంటర్వెల్ మరియు ముందు సీన్లు బాగున్నాయి. ముఖ్యంగా సీక్రెట్ విష ప్రయోగాల వల్ల వచ్చే జాంబీ వైరస్ లాంటి వింత రోగాలు వస్తే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారు ? అనే యాంగిల్ లో ఈ చిత్రం సాగింది. ఈ సినిమాలో హీరోగా నటించిన తేజ తన పాత్రకు తగ్గట్లు చాల బాగా నటించాడు.
మిగిలిన నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఆనంది నటనే హైలైట్ గా నిలుస్తోంది. అలాగే ఈ సినిమాకి మరో ప్రధానాకర్షణ గెటప్ శ్రీను. ఆయన తన కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాల్లో తన ముద్ర కనబరుస్తూ కొన్నిచోట్ల నవ్వులు పూయించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేస్తూ నవ్వించే ప్రయత్నం చేసారు. ఇతర కీలక పాత్రల్లో నటించిన హర్షవర్ధన్, హరితేజ తమ నటనతో మెప్పిస్తారు.
అయితే, రెండు గంటలు పాటు జాంబిరెడ్డి ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. దర్శకుడు కనీసం హర్రర్ అండ్ కామెడీ సన్నివేశాలతో కూడా పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనం మాత్రం ముందుకు నడిపించవు. పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్.
Also Read: ఈసారైనా ప్రదీప్ కోరికను ‘పవర్ స్టార్’ తీరుస్తాడా !
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన
ఎమోషనల్ గా సాగే జాంబిల డ్రామా
కొన్ని సప్సెన్స్ సీన్స్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్ :
ప్లే బోర్ గా సాగడం,
అక్కడక్కడా స్లోగా నడిచే సన్నివేశాలు
బోరింగ్ ట్రీట్మెంట్,
రెగ్యులర్ కామెడీ
చివరగా :
జాంబి రెడ్డి అంటూ వచ్చిన ఈ జాంబిల సప్సెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల్లకు కొత్త అనుభూతిని ఇవ్వడంలో కొంతవరకు సఫలమైంది. అయితే ఫస్ట్ హాఫ్ లో నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు, అక్కడకడ వర్కౌట్ కాని సీన్స్ సినిమాలో బలహీనతలుగా మిగులుతాయి. మొత్తం మీద భిన్నమైన, కొత్త తరహా చిత్రాలను ఇష్టపడేవారితో నచ్చుతుంది. అయితే కమర్షియల్ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం ఈ చిత్రం నచ్చదు.
రేటింగ్ : 2
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Zombie reddy movie review
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com