Pushpa 2 Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం టాలీవుడ్ లో కంటే ఎక్కువగా బాలీవుడ్ లో రికార్డ్స్ ని నెలకొల్పుతున్న సంగతి అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో ఈ చిత్రానికి ఇప్పటికీ డబుల్ డిజిట్ లోనే నెట్ వసూళ్లు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం కథలో మరో సంచలనం నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా హిందీ వెర్షన్ లో 632 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇది ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా చెప్తున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. వందేళ్ల బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో, ఒక డబ్బింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలబడడం అనేది మొట్టమొదటిసారి పుష్ప 2 విషయం లోనే జరిగిందని, భవిష్యత్తులో ఈ రికార్డు ని ముట్టుకోవడం ఎవ్వరి తరం కాదని, ఖాన్స్ కి కూడా అసాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రం హిందీ వెర్షన్ లో దాదాపుగా 629 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ రికార్డుని పుష్ప అధిగమించి బాలీవుడ్ కి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం అసాధ్యం. ఎందుకంటే #RRR చిత్రం ఇక్కడ 250 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. పుష్ప 2 ఇంకా 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా అందుకోలేదు. మహా అయితే ఇంకో 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టొచ్చేమో అంతే. అంతకు మించి వసూళ్లు కష్టమే. ఇక్కడ సాధ్యం కానీ ఇండస్ట్రీ హిట్ ని, అల్లు అర్జున్ బాలీవుడ్ లో సాధ్యపడేలా చేయడం అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్ తో ఈ చిత్రం బాలీవుడ్ లో మొట్టమొదటి 700 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన సినిమాగా మారబోతుంది.
దీంతో పాటు క్రిస్మస్ కూడా ఈ చిత్రానికి మరో భారీ అడ్వాంటేజ్. ఆ వీకెండ్ లో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం పవర్ ప్లే చేయనుంది. అయితే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి జనవరి 9 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం జోరుగా సాగిన సంగతి తెలిసిందే. దీనిపై మూవీ టీం కాసేపటి క్రితమే స్పందించింది. ‘పుష్ప 2 ‘ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి రకరకాలుగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలను నమ్మకండి. పుష్ప 2 చిత్రం 58 రోజుల తర్వాతే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియా లో ప్రచారమైన ఫేక్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా 2000 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.