YCP Ministers: ఫ్లవర్ అనుకుంటిరా.. కాదు మేము పవరూ అన్న రేంజ్ లో విపక్ష నేతలను ఓ రేంజ్ లో అడిపోసుకునే వారు మన వైసీపీ మంత్రులు. పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి, అవంతి మీడియా ముందుకొచ్చారంటే చాలూ నోటికి పని చెప్పేవారు. ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్ లో బూతులు మాట్లాడేవారు. మీడియాకు సరిపడా వ్యాఖ్యానాలు చేసేవారు. అయితే అంతకు మించి ఆశించారో ఏమో.. జగన్ టీమ్ ను లేపేసి కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అధినేత ఆశించిన రీతిలో కొత్త మంత్రులు వినోదాన్ని పంచలేకపోతున్నారు. మీడియా సమావేశాల్లో తేలిపోయి మాట్లాడుతున్నారు.
చంద్రబాబు ఉన్మాది, సరిగ్గా పాలించలేకపోయారు, అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారు, జగన్ గొప్పవారు, మహానుభావుడు వంటి వ్యాఖ్యానాలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాల గురించి చెప్పినప్పుడు తడబడుతున్నారు. ఎంతో ఊహించుకొని మీడియా సమావేశానికి వెళుతున్న విలేఖర్లకు మీరు రాసుకోండి అంటూ ప్రారంభిస్తూ తుష్ మనిపిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు, ఈ మూడేళ్ల ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు, ఆర్ కే రోజా మాటలను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే.. మంత్రి పీఠం ఎక్కిన తరువాత వారేనా అని అనిపిస్తోంది. అమాత్య పదవిలోకి వచ్చాము.. హుందాగా ఉందామనుకుంటున్నారో ఏమో.. అధినేత టాస్కును పూర్తిచేయాలేకపోతున్నారన్న టాక్ వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రెస్ మీట్లలో పొడిపొడి మాటలు మాటాడి వెళ్లిపోతున్నారు.
Also Read: Elon Musk: ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్.. ఇకనైనా ‘వాక్ స్వాతంత్య్రం’ వచ్చేనా?
అంబటి రాంబాబు తన తొలి రెండు ప్రెస్ మీట్లలో తడబడిపోయారు. వాస్తవానికి రాంబాబు మంచి వక్త. మాట మార్చి తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి. సినిమా డైలాగులు మాదిరిగా అనర్గళంగా మాట్లాడతారు. విపక్షాలపై విరుచుకుపడతారు. అటువంటి వ్యక్తి మంత్రి కావడంతో విపక్షాలకు సీన్ సితారే అని వైసీపీ శ్రేణులు ఆశించాయి. కానీ సీన్ రివర్స్. ఆయన వ్యాఖ్యానాలు మాట అటుంచి.. తిరిగి మీడియా ప్రతినిధులే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. డయాఫ్రంవాల్ ఏంటో తెలియదని చెప్పడం ద్వారా మీడియా ఎదుట పలుచన అయిపోయారు. ఆయన పెట్టిన రెండు ప్రెస్ మీట్లు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఇక విజయవాడ అత్యాచారం ఘటనలో హోంమంత్రి వనిత స్పందించిన తీరుపై కూడా నెటిజెన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మీడియా మైకుల ముందు నిలబడి ఏం మాట్లాడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి ఉషాశ్రీచరణ్ అయితే తనకు ప్రాథమిక అంశాలపై కూడా అవగాహన లేదని నిరూపించుకున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆమె ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్కూల్ పిల్లలో కలిసి భోజనం చేస్తూ ఇది సాంబార్ అన్నమా.. కిచిడినా అని అడిగి నివ్వెరపరిచారు. వీడియో నెట్టింట్లో వైరల్ అయిపోయింది. సాంబారు అన్నానికి, కిచిడికి తేడా తెలియని మంత్రి అంటూ నెటిజెన్లు తెగ ఏకిపారేస్తున్నారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మంత్రి అయిన తరువాత తనలో ఉన్న ఫైర్ ను దాచుకుంటున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సొంత జిల్లాలో అడుగుపెట్టిన సందర్భంలో విపక్షంతో పాటు స్వపక్షంలో విపక్షానికి గట్టి హెచ్చరికలే పంపారు. రోజా అంటే ఏంటో చూపిస్తానని వీరలెవల్ లో ప్రకటించారు. కానీ ఎందుకో ఆమె తగ్గినట్టు కనిపిస్తోంది. సాధారణ వ్యాఖ్యానాలకే పరిమితమవుతున్నారు. మేము ఊహించినదేమిటి? మీరు చేస్తున్నదేమిటి? అని సగటు వైసీపీ అభిమాని మంత్రుల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏరి కోరి మంత్రులుగా పెట్టుకున్న సజ్జల రామక్రిష్ణా రెడ్డి వారికి హితబోధ చేయాలని కోరుతున్నారు.
Also Read:Goutam Adani: ప్రపంచ కుబేరుల్లో 5వ స్థానానికి.. వారెన్ బఫెట్ ను దాటేసిన గౌతం అదానీ
Recommended Videos
Web Title: Ycp ministers faltering at press meetings
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com