Sri Lanka Financial Crisis 2022: మన పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాుతోంది. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగి పోయాయి. బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీంతో ప్రజలు బియ్యం కొనుగోలు చేయడానికి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడటం తెలిసిందే. చమురు ధరలైతే చుక్కులు చూపిస్తున్నాయి. ఫలితంగా దేశం యావత్తు తీవ్ర కరువు ఎదుర్కొంటోంది. ప్రజలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొందరు మన దేశానికి శరణార్థులుగా వస్తున్నారు. తమిళనాడుకు వచ్చి తలదాచుకుంటున్నారు. శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

తినడానికి తిండి దొరక్క, తాగడానికి నీళ్లు అందుబాటులో లేక నరకయాతన అనుభవిస్తున్నారు. దేశంలో ఏర్పడిన సంక్షోభానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. పర్యాటక దేశంగా పరిఢవిల్లిన లంక ప్రస్తుతం దారిద్ర్యంతో కాలం వెళ్లదీస్తోంది. ఎటు చూసినా కరువు దృశ్యాలే. ఏ వైపు నుంచైనా బాధలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు జీవనం కొనసాగించలేకపోతున్నారు. కూరగాయల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి.
Also Read:Jr.NTR : రాజకీయాల్లోకి రాకపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్
రిజర్వాయర్లలో నీళ్లు నిండుకోవడంతో విద్యుత్ సంక్షోభం సైతం తలెత్తుతోంది. దీంతో వీధి దీపాలు ఆర్పేస్తున్నారు. ఈ కోతలు మే వరకు కొనసాగుతాయని తెలుస్తోంది. కొలంబో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఫలితంగా ట్రేడింగ్ సమయం కూడా నాలుగున్నర గంటల నుంచి రెండు గంటలకు తగ్గిపోవడం గమనార్హం. ఈ క్రమంలో శ్రీలంక స్టాక్ మార్కెట్ నష్టాల బాటలనే పయనిస్తున్నాయి.

శ్రీలంకలో ఈస్టర్ పండుగ వేళ 2019లో చర్చిలో జరిగిన దాడితో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇక అప్పటి నుంచి దేశానికి నష్టాలే మిగిలాయి. దీనికి తోడు కరోనా ప్రభావం కూడా దేశాన్ని కుదిపేసింది. దీంతో శ్రీలంక ప్రభుత్వం దిగుమతులపై నిషేధం కొనసాగగా ఆహార సంక్షోభం తీవ్ర బాధల్ని పెంచింది. ఫలితంగా దేశంలో ప్రస్తుతం కరువు కరాళ నృత్యం చేస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు ఐదింతలు పెరిగి సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం కొనలేక ఏం తినలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియడం లేదు.
Also Read: KCR Bio-Pic: ప్చ్.. మళ్ళీ కేసీఆర్ బయోపిక్ మీదకు వచ్చాడు !
[…] […]