Homeఅంతర్జాతీయంUS involvement in Middle East conflict: పశ్చిమాసియా యుద్ధం.. అడ్డంగా ఇరుక్కుపోయిన అమెరికా!

US involvement in Middle East conflict: పశ్చిమాసియా యుద్ధం.. అడ్డంగా ఇరుక్కుపోయిన అమెరికా!

US involvement in Middle East conflict: కేవలం సాంమ్రాజ్యవాద కాంక్షతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాల రగిలించిన అమెరికా ఇప్పుడు అందులో నుంచి బయట పడేందుకు తంటాలు పడుతోంది. యుద్ధం నుంచి ఎలా బయట పడలో తెలియక సతమతమవుతోంది. ఇరాన్‌తో పోరు అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతికూల ప్రభావాలను తీసుకురాబోతోంది. అగ్రరాజ్యం దశాబ్ద కాలంగా నిల్వ చేసుకున్న క్షిపణి వ్యవస్థలు ఈ పోరాటంలో వేగంగా కరిగిపోతున్నాయి. పరిమిత సంఖ్యలోనే తయారు చేయగలిగే దీర్ఘ పరిధి క్షిపణులు […]

US involvement in Middle East conflict: కేవలం సాంమ్రాజ్యవాద కాంక్షతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాల రగిలించిన అమెరికా ఇప్పుడు అందులో నుంచి బయట పడేందుకు తంటాలు పడుతోంది. యుద్ధం నుంచి ఎలా బయట పడలో తెలియక సతమతమవుతోంది. ఇరాన్‌తో పోరు అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతికూల ప్రభావాలను తీసుకురాబోతోంది. అగ్రరాజ్యం దశాబ్ద కాలంగా నిల్వ చేసుకున్న క్షిపణి వ్యవస్థలు ఈ పోరాటంలో వేగంగా కరిగిపోతున్నాయి. పరిమిత సంఖ్యలోనే తయారు చేయగలిగే దీర్ఘ పరిధి క్షిపణులు ఖర్చు అయ్యే క్రమంలో భవిష్యత్తులో తలెదురయ్యే సవాళ్లకు అవి సరిపోకపోయే ప్రమాదం నెలకొంది.

పశ్చిమాసియాకు మెజారిటీ సైన్యం..
ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని, పసిఫిక్, యూరోప్‌ వంటి ప్రాంతాల నుంచి పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ ప్రాంతంలో జపాన్‌లోని మెరైన్‌ కోర్‌ యూనిట్‌లు, విమానవాహక నౌకలు వంటివి కేంద్రీకృతం అవుతున్నాయి. దీంతో ఇండో–పసిఫిక్‌ వంటి హైపోటెన్షియల్‌ టైట్‌ జోన్లలో అమెరికా సామర్థ్యం తగ్గింది. ప్రత్యర్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి.

చైనా వద్ద క్షిపణి బలం..
అమెరికా ఇండో–పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ శామ్యూల్‌ జె పాపారో చెప్పినట్టు, భవిష్యత్తులో చైనాతో యుద్ధం వస్తే క్షిపణుల అవసరం భారీగా ఉంటుంది. కానీ ఇప్పటికే చైనా వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణులు ఉన్నాయి. తైవాన్‌పై చైనా పట్టు ఇంకా బలపడుతుండటంతో, ఆ ప్రాంతంలో అమెరికా–మిత్రదేశాల స్థావరాలు లక్ష్యం కావచ్చనే ఆందోళన పెరుగుతోంది. ఇరాన్‌తో పోరులో అమెరికా ఇప్పుడు ఉపయోగిస్తున్న పెద్ద సంఖ్యలో క్షిపణులు, పశ్చిమాసియాలో మోహరించిన సైన్యం తైవాన్‌ వివాదం వస్తే చైనాతో పోరాడడానికి తగినంతగా ఉండవనే అవకాశం ఉంది.

ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా సైనిక వ్యయం రోజుకు సుమారు ఒక బిలియన్‌ డాలర్ల వరకూ పెరిగింది. ఈ పెద్ద భారం స్వదేశంలో ప్రజా–రాజకీయ వ్యతిరేకతగా మారుతోంది. పశ్చిమాసియాలో అమెరికా పరిస్థితి నుంచి వెనక్కి తగ్గే అవకాశం కనిపించటం లేదు. అందువల్ల తానే ప్రతికూల సమస్యను సృష్టించి.. తానే ఆ వలలో బంధించబడినట్లుగా అమెరికా పరిస్థితి మారిపోతోంది. యుద్ధం ఇప్పటికీ నియంత్రణలోనే ఉన్నా.. దాని ద్వారా సృష్టించే ఆర్థిక, సైనిక, రాజకీయ ఖాళీలు కాలక్రమేణా పెద్ద ప్రభావం చూపనున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper