Viral Video : పైన చెప్పిన ఉపోద్ఘాతం ఇజ్రాయిల్ దేశానికి కూడా వర్తిస్తుంది. ఇజ్రాయిల్ ఆసియాలోనే ఉన్నప్పటికీ.. దాని చుట్టూ మొత్తం శత్రు దేశాలే. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా కబళించాలని చూసేవే. అటు పాలస్తీనా.. ఇటు ఇరాన్, ఇరాక్.. సిరియా.. ఇలా ప్రతి దేశం కూడా శత్రు దేశమే. అందువల్లే ఇజ్రాయిల్ బిక్కుబిక్కుమంటూ కాలం గడపక.. సింహం లాగా ఎదురు తిరగడం మొదలు పెట్టింది. తన జోలికి వచ్చిన ఏ దేశాన్నీ వదిలిపెట్టకుండా దాడులు చేసింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక శక్తి ఉన్న దేశంగా రికార్డు సృష్టించింది.
ఇజ్రాయిల్ దేశానికి పాలస్తీ నాకు మధ్య యుద్ధం ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా అది సాగుతూనే ఉంది. అయినప్పటికీ పాలస్తీనాకు వెన్ను చూపించకుండా ఇజ్రాయిల్ పోరాడుతూనే ఉంది. పాలస్తీ నాకు ఇరాన్, ఇరాక్, సిరియా వంటి దేశాల మద్దతు ఉన్నప్పటికీ.. ఇజ్రాయిల్ ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. పైగా హమాసులాంటి ఉగ్రవాదులు పాలస్తీ నాకు అండగా ఉన్నారు. పాలస్తీ నా దేశాన్ని ముందు పెట్టి వారు దాడులు చేస్తున్నారు. దీంతో తిక్కరేగిన ఇజ్రాయిల్ పాలస్తీనా పని పట్టాలని.. హమాస్ తీవ్రవాదులకు బుద్ధి చెప్పాలని కసి తీరా నిర్ణయాలు తీసుకుంది. తద్వారా ఇజ్రాయిల్ జోలికి వచ్చే దేశాలకు చివరికి బూడిదే మిగులుతున్నది.
Also Read : శత్రుదుర్భేద్యంగా భారత సరిహద్దులు.. సిద్ధమవుతున్న మరో అత్యాధునిక మిసైల్..!
ఇక ఇటీవల 15 మంది ఇజ్రాయిల్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు చంపారు. దీంతో ఇజ్రాయిల్ సైన్యం శివతాండవం చేసింది. మామూలుగానే ఒక టెంపోలో యుద్ధం చేసే ఇజ్రాయిల్ సైనికులు.. దారుణంగా రెచ్చిపోయారు. హమాస్ ఉగ్రవాదులకు కాలరాత్రి అంటే ఏమిటో కళ్ళ ముందు చూపించారు. డ్రోన్లతో.. యుద్ధ విమానాలతో రెచ్చిపోయారు. హమాస్ ఉగ్రవాదులకు స్థావరం గా ఉన్న గాజానగరంపై రెచ్చిపోయారు. గాజా నగరాన్ని తునా తునకలు చేశారు.. గాజానగరంలో ఇజ్రాయిల్ చేసిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి..” సాధారణంగానే ఇజ్రాయిల్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఉంటుంది. తమ దేశ పౌరుల జోలికి వచ్చే వారికి చుక్కలు చూపిస్తుంది. అలాంటిది తమ దేశ పౌరులను చంపేస్తే ఇజ్రాయిల్ ఎలా ఊరుకుంటుంది? అందుకే హమాస్ తీవ్రవాదులకు నరకం చూపించింది. వాళ్ల స్థావరాలను నేలమట్టం చేసింది. ఇంతకంటే ప్రతీకారం ఏముంటుందని” సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పాలస్తీనా తన తీరు మార్చుకోవాలని.. ఉగ్రవాద దేశాలతో జతకట్టడం మానివేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు హితవు పలుకుతున్నారు. లేకపోతే ఇజ్రాయిల్ మరింత దారుణంగా దాడులు చేస్తుందని.. కనీసం భూమ్మీద బతికే అవకాశం కూడా ఇవ్వదని.. సర్వనాశనం చేసి బూడిద చేతిలో పెడుతుందని పేర్కొంటున్నారు.
15 మంది ఇశ్రాయేల్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు చంపితే.. హమాస్ స్థావరం అయిన గాజాకు పట్టిన గతి ఇది..
ఇజ్రాయెల్ కు సాటి లేరు మరెవరు. #Israel #Gaza #Hamas #UANow pic.twitter.com/qAgoqg2Igh
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) May 20, 2025