spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Rashmika first media appearance: పెళ్లి తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చిన...

Vijay Deverakonda Rashmika first media appearance: పెళ్లి తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక.. వీడియో వైరల్!

Vijay Deverakonda Rashmika first media appearance: 8 ఏళ్ళ నుండి సుదీర్ఘంగా ప్రేమించుకుంటున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట నిన్న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా పెళ్లి బంధం ద్వారా శాశ్వతంగా ఏకం అయ్యారు. వీళ్ళ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఎంతో మంది టాప్ సినీ సెలబ్రిటీల వివాహాలు జరిగాయి. కానీ ఎవ్వరికీ కూడా వీళ్లిద్దరి కి వచ్చినంత అటెన్షన్ రాలేదు . వీళ్లిద్దరు ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తే, ఇద్దరికీ కలిపి 40 మిల్లియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. హిస్టరీ లో ఎవరికీ కూడా ఈ రేంజ్ రీచ్ రాలేదు. ఈ జంటకు యూత్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. సినీ సెలబ్రిటీలు కూడా ఫోటోల క్రింద శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే పెళ్లి పనులు చూసుకున్న తర్వాత ఈ జంట ఇద్దరు ఉదయ్ పూర్ విమానాశ్రయం కి చేరుకోగా, వీళ్ళని చూసేందుకు అభిమానులు, మీడియా రిపోర్టర్స్ భారీగా వచ్చారు. వీళ్ళు విమానాశ్రయం లోకి అడుగుపెట్టగానే అందరూ కేరింతలు కొట్టారు . అభిమానుల కోసం వీళ్లిద్దరు కెమెరా ముందుకొచ్చి , జంటగా ఆడియన్స్ కి ఫ్లైయింగ్ కిస్ వదిలారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. ఇకపోతే వీళ్లిద్దరు తిరిగి హైదరాబాద్ కి కాసేపటి క్రితమే చేరుకున్నారు. వచ్చే నెల 4న హైదరాబాద్ లోని బంజారా హిల్స్, తాజ్ బంజారా హోటల్ లో గ్రాండ్ గా జరగనున్న ఈ జంట రిసెప్షన్ కోసం ఏర్పాటు దగ్గరుండి చూసుకోబోతున్నారు. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ హాజరు కాబోతున్నారు. అదే విధంగా రాజకీయ నాయకులూ , పారిశ్రామిక వేత్తలు కూడా ఈ రిసెప్షన్ లో మెరవబోతున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ మరోసారి డైరెక్షన్ చేయబోతున్నారా..? కథేంటి ఇంత వైలెంట్ గా ఉంది..?

ఇదంతా పక్కన పెడితే ఈ క్యూట్ జంట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కూడా కలిసి రిసెప్షన్ కి రావాల్సిందిగా కోరారు. మరి ఆయన వస్తారో లేదో తెలీదు కానీ, వస్తే మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది . ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ, రష్మిక జంటలకు కేవలం టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా పరిచయాలు , స్నేహాలు ఎక్కువ. కాబట్టి బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులందరూ హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించిన వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియా లో అందుబాటులోకి రాబోతున్నాయట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper