Guwahati weather : వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. స్మార్ట్ సిటీగా పేరుందిన గౌహతి నగరంలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాలలో మోకాళ్ళ లోతు వరద నీరు ఉండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. జూ రోడ్, గీతా నగర్,మాలి గావ్, హెదాయెత్ పూర్, గౌహతి క్లబ్, ఉలుబారి, లచిత్ నగర్, చాంద్ మారి, పంజాబరి ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. రాత్రిపూట కురిసిన వర్షాల వల్ల జిఎస్ రోడ్డు, జోరా బత్, తరుణ్ నగర్, జతియ, జ్యోతి కుచి, ఘోరమర, విఐపి రోడ్డు, రుక్మిణి గావ్, సర్వే, చత్రిబారి వంటి ప్రాంతాలలో వరద నీరు నిలిచిపోయింది.
Also Read : శత్రుదుర్భేద్యంగా భారత సరిహద్దులు.. సిద్ధమవుతున్న మరో అత్యాధునిక మిసైల్..!
వరద నీరు వల్ల వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. చివరికి అంబులెన్సులు కూడా కదలకుండా అలాగే ఉండిపోయాయి. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అకస్మాత్తుగా సంభవించిన వరదలు అస్సాం రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. గతంలో మే నెలలో ఎప్పుడు కూడా అస్సాంలో వర్షాలు కురవలేదు. ఒకవేళ వర్షాలు కురిసినా ఈ స్థాయిలో నష్టం వాటిల్ల లేదు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం వచ్చే మూడు రోజుల్లో అస్సాంలో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుందని సమాచారం.
ఇక మంగళవారం గౌహతిలోని ఎడబ్ల్యూఎస్ స్టేషన్ వద్ద 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక వచ్చే రోజుల్లో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో అతి తీవ్రస్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కొండ చరియ ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక గత ఏడాది ఆగస్టులో గౌహతిలో విపరీతమైన వరదలు సంభవించిన నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. వరదల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.. వరదల నివారణకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించాలని.. దానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని కోరింది. గత ఏడాది ఆగస్టులో విపరీతమైన వరదలు వస్తే.. ఈసారి మే నెల చివరి వారంలోనే అస్సాంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. వరదలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి.. వాతావరణంలో అననుకూల పరిస్థితుల వల్లే ఇలాంటి వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మే నెలలో పరిస్థితి ఇలా ఉంటే.. ఆగస్టులో ఎలా ఉంటుందని అస్సాం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వరదల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా.. నదులు, కాలువలలోకి మళ్లించాలని సూచిస్తున్నారు. అటవీ ప్రాంతాలలో ఆక్రమణలు జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.