Homeఅంతర్జాతీయంVenezuela Earthquake: వెనిజులా భూకంపం.. ఏమిటీ సిస్మిక్ డబ్లెట్..

Venezuela Earthquake: వెనిజులా భూకంపం.. ఏమిటీ సిస్మిక్ డబ్లెట్..

Venezuela Earthquake: దక్షిణ అమెరికా ప్రాంతంలో అత్యంత కీలకమైన వెనిజులా దేశంలో భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటన తీవ్రమైన విధ్వంసం కారణమైంది. రాజధాని కారాకస్ ప్రాంతంలో అతిపెద్ద భవనాలు నేలకూలిపోయాయి. ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి వచ్చారు. సునామి తరహాలో హెచ్చరికలు కూడా అక్కడ వినిపించాయి. ఈ ఘటన జరిగిన తర్వాత శిథిలాలను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. చనిపోయిన వారు.. గాయపడిన వారు భారీగా ఉంటారని తెలుస్తోంది.. భూకంపం తీవ్రంగా చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం […]

Venezuela Earthquake: దక్షిణ అమెరికా ప్రాంతంలో అత్యంత కీలకమైన వెనిజులా దేశంలో భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటన తీవ్రమైన విధ్వంసం కారణమైంది. రాజధాని కారాకస్ ప్రాంతంలో అతిపెద్ద భవనాలు నేలకూలిపోయాయి. ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి వచ్చారు. సునామి తరహాలో హెచ్చరికలు కూడా అక్కడ వినిపించాయి. ఈ ఘటన జరిగిన తర్వాత శిథిలాలను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. చనిపోయిన వారు.. గాయపడిన వారు భారీగా ఉంటారని తెలుస్తోంది..

భూకంపం తీవ్రంగా చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఓ అంచనా ప్రకారం దాదాపు లక్ష మంది చనిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.. బుధవారం సాయంత్రం వెనిజులా దేశంలో ఉన్న పశ్చిమ ప్రాంతంలో ముందుగా 7.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. ఆ తర్వాత సాన్ పేలిపే వద్ద భూకంప కేంద్రం ఏర్పడింది.. ఆ తర్వాత కేవలం 39 సెకండ్ల వ్యవధిలోనే యు మారే ప్రాంతం వద్ద 7.5 తీవ్రతతో మరోసారి భూకంపం చోటుచేసుకుంది. ఆ తర్వాత భూమి ఏకంగా 20 సార్లు స్వల్పంగా కనిపించడం విశేషం. క్షణంలోనే పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి.. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇలా ఒకేసారి రెండు పర్యాయాలు తీవ్రస్థాయిలో భూకంపాలు రావడానికి సిస్మిక్ డబ్లెట్ అని పిలుస్తుంటారు దీనివల్ల ఆస్తితో పాటు ప్రాణం నష్టం ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి భూకంపాలు ఏర్పడినప్పుడు సహజంగా 10,000 మంది చనిపోతారని.. వెనిజులా ప్రాంతంలో చోటుచేసుకున్న భూకంపం వల్ల మృతుల సంఖ్య లక్ష వరకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వెనిజులా అధికారికంగా మృతుల సంఖ్యను బయట పెట్టలేదు.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సి రోడ్రీగేజ్ జరిగిన ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సహాయక చర్యలు వేగవంతంగా చేపడుతున్నట్టు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఆమె సానుభూతి తెలిపారు. అంతేకాదు భూకంపం వల్ల కారా కాస్ విమానాశ్రయంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 24న సెలవు దినం కావడంతో చాలామంది ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. అందువల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper