Homeఅంతర్జాతీయంUS Student Visa Rules: స్టూడెంట్స్‌కు అమెరికా షాక్‌.. ఇక అగ్రరాజ్యంలో ఉండడం కష్టమే..

US Student Visa Rules: స్టూడెంట్స్‌కు అమెరికా షాక్‌.. ఇక అగ్రరాజ్యంలో ఉండడం కష్టమే..

US Student Visa Rules: అగ్రరాజ్యం అమెరికాకు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న విదేశీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫస్ట్‌ నినాదంతో విదేశీ ఉద్యోగులు, విద్యార్థులను దేశం నుంచి వెళ్లగొట్టేలా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌ జారీ చేస్తున్నాడు. ఫలితంగా హెచ్‌–1బీ వీసాపై వెళ్లినవారు, స్టూడెంట్‌ వీసాపై వెళ్లినవారు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సొంత దేశాలకు వెళ్లిపోయారు. కొత్తగా వెళ్లాలనుకునేవారు కూడా పునరాలోచనలో పడ్డారు. ఇలాంటి సమయంలో అమెరికా తన […]

US Student Visa Rules: అగ్రరాజ్యం అమెరికాకు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న విదేశీయులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫస్ట్‌ నినాదంతో విదేశీ ఉద్యోగులు, విద్యార్థులను దేశం నుంచి వెళ్లగొట్టేలా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌ జారీ చేస్తున్నాడు. ఫలితంగా హెచ్‌–1బీ వీసాపై వెళ్లినవారు, స్టూడెంట్‌ వీసాపై వెళ్లినవారు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సొంత దేశాలకు వెళ్లిపోయారు. కొత్తగా వెళ్లాలనుకునేవారు కూడా పునరాలోచనలో పడ్డారు. ఇలాంటి సమయంలో అమెరికా తన ఇమిగ్రేషన్‌ విధానంలో ముఖ్యమైన మార్పు తీసుకురానుంది. ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌(ఎఫ్‌ వీసా), ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్స్‌ (జే వీసా) కోసం గరిష్టంగా నాలుగు సంవత్సరాల పరిమితి విధించనుంది. ఈ కాలం తర్వాత అమెరికాలో కొనసాగాలంటే యూఎస్‌సీఐఎస్‌(యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ – ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌) ద్వారా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. బయోమెట్రిక్స్‌ ఇవ్వడం, ఫీజులు చెల్లించడం తప్పనిసరి అవుతాయి. గతంలో చదువు పూర్తయ్యే వరకు ఉండేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని తొలగించి, స్థిరమైన నాలుగేళ్ల పరిమితిని అమలు చేయనున్నారు.

కొత్త విధానం ఏమిటి?
ఎఫ్‌ వీసా ద్వారా అమెరికాలో చదువుకునే విద్యార్థులు, జే వీసా ద్వారా ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లలో పాల్గొనే వారికి ఇకపై నాలుగు సంవత్సరాలకు మించి ఆటోమేటిక్‌గా ఉండేందుకు అనుమతి ఉండదు. నాలుగేళ్లు పూర్తయిన తర్వాత కొనసాగాలంటే యూఎస్‌సీఐఎస్‌కు ప్రత్యేక దరఖాస్తు చేయాలి. ఇందులో బయోమెట్రిక్‌ డేటా ఇవ్వడం, నిర్దిష్ట ఫీజు చెల్లించడం తప్పనిసరి. ఇది మునుపటి విధానం కంటే ఎక్కువ బ్యూరోక్రసీ, అదనపు ఖర్చును తెచ్చిపెడుతుంది.

పాత విధానంలో మార్పులు ఇవీ..
గతంలో విద్యార్థులు తమ కోర్సు లేదా ప్రోగ్రామ్‌ పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండేందుకు సౌకర్యం ఉండేది. బ్యాచిలర్‌ డిగ్రీకి 4 సంవత్సరాలు, మాస్టర్స్‌కు 2 సంవత్సరాలు, పీహెచ్‌డీకి 5–7 సంవత్సరాలు వరకు సహజంగానే అనుమతి ఉండేది. కొత్త నిబంధనలో ఈ ‘‘చదువు పూర్తయ్యే వరకు’’ అనే సౌకర్యాన్ని తొలగించి, ఏకరీతి 4 సంవత్సరాల పరిమితిని విధించారు. దీంతో దీర్ఘకాలిక కోర్సులు చేసే వారికి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి విస్తరణ కోసం ప్రక్రియ చేయాల్సి వస్తుంది.

విద్యార్థులపై ప్రభావం..
ఈ మార్పు వల్ల చాలా మంది ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌కు ప్రణాళికలు మారవచ్చు.
దీర్ఘకాలిక ప్రోగ్రామ్‌లు (పీహెచ్‌డీ, రీసెర్చ్‌) చేసే వారు అదనపు ఖర్చు, సమయం, ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది. చదువు మధ్యలోనే వీసా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఓపీటీ(Optional Practical Training) లేదా ఉద్యోగ అవకాశాల కోసం ప్రణాళికలు కూడా ప్రభావితం కావచ్చు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆర్థిక, మానసిక భారం పెరుగుతుంది.

అమెరికా విద్యా వ్యవస్థపై ప్రభావం..
అమెరికా విశ్వవిద్యాలయాలు ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడతాయి. ఈ నిబంధనలతో విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. దీంతో విశ్వవిద్యాలయాల ఆదాయం, క్యాంపస్‌ డైవర్సిటీ, రీసెర్చ్‌ ప్రాజెక్టులు ప్రభావితం కావచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఇంటర్నేషనల్‌ విద్యార్థులు ముఖ్యమైన సహకారం అందిస్తారు. కొత్త విధానం దీన్ని కొంతవరకు పరిమితం చేసే అవకాశం ఉంది.

ముందస్తు సన్నాహాలు..
ఈ మార్పు అమలులోకి వచ్చిన తర్వాత విద్యార్థులు తమ కోర్సు వ్యవధిని ముందుగానే జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలి. చిన్న కాలపు కోర్సులు ఎంచుకోవడం ఒక ఎంపిక. నాలుగేళ్ల తర్వాత విస్తరణ కోసం అవసరమైన డాక్యుమెంట్లు, ఫీజులు ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ఇతర దేశాల విద్యా అవకాశాలను కూడా పరిశీలించడం బాగుంటుంది.

మొత్తంమీద, అమెరికా ఇమిగ్రేషన్‌ విధానంలో ఈ మార్పు విద్యార్థులకు మరింత నియంత్రణ, బాధ్యతను తెచ్చిపెడుతుంది. ఇది దీర్ఘకాలిక విద్యా ప్రణాళికలను కొంత కష్టతరం చేసినప్పటికీ, విద్యార్థులు ముందస్తు సన్నాహాలతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు. విశ్వవిద్యాలయాలు కూడా విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఈ పరివర్తనను సులభతరం చేయాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper