Homeఅంతర్జాతీయంChilkur Balaji Temple: మా దేవుడు మా ఇష్టం.. మీకేంటి నొప్పి.. మన వీసా దేవుడిపై...

Chilkur Balaji Temple: మా దేవుడు మా ఇష్టం.. మీకేంటి నొప్పి.. మన వీసా దేవుడిపై అమెరికా అక్కసు..!

Chilkur Balaji Temple: అగ్రరాజ్యం అమెరికాకు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఆ దేశంలో రాజకీయ నేతలు ట్రంప్‌లాగే మారిపోతున్నారు. ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ నినాదం ఒంట పట్టించుకుని అమెరికాలో ఉంటున్న విదేశీయులపై అక్కలు వెల్లగక్కుతున్నారు. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా.. నేతలు మాత్రం తాము ప్రజల కోసం ఏదో చేస్తున్నట్లు చెప్పుకోవడానికి భారత్‌ వంటి దేశాలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా మన వీసా దేవుడిగా గుర్తింపు పొందిన చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా […]

Chilkur Balaji Temple: అగ్రరాజ్యం అమెరికాకు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఆ దేశంలో రాజకీయ నేతలు ట్రంప్‌లాగే మారిపోతున్నారు. ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ నినాదం ఒంట పట్టించుకుని అమెరికాలో ఉంటున్న విదేశీయులపై అక్కలు వెల్లగక్కుతున్నారు. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా.. నేతలు మాత్రం తాము ప్రజల కోసం ఏదో చేస్తున్నట్లు చెప్పుకోవడానికి భారత్‌ వంటి దేశాలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా మన వీసా దేవుడిగా గుర్తింపు పొందిన చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనెటర్‌ ఎరిక్‌ ష్మిట్‌ తీవ్ర విమర్శ చేశారు. హెచ్‌–1బీ, ఎల్‌–1, ఎఫ్‌–1, ఓపీటీ వీసాల వ్యవస్థ అమెరికన్‌ మిడిల్‌ క్లాస్‌ను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఆలయం చుట్టూ ’మోసపూరిత’ భక్తులు తిరుగుతున్నారని అక్కసు వెల్లగక్కారు.

చిలుకూరు ఆలయ చరిత్ర
1996లో ప్రారంభమైన చిలుకూరు బాలాజీ ఆలయం అమెరికా వీసా కోరుకున్నవారికి వస్తుందన్న నమ్మకం ప్రపంచవ్యాప్త భారతీయులను ఆకర్షిస్తోంది. 10 ఏళ్లలో 5 లక్షల మంది సందర్శకులు, వీసా మొక్కుకుని 80 శాతం మంది సాధించారని అంచనా. ఐటీ ప్రెఫెషనల్స్, ప్రధాన భక్తుల విశ్వాసం చిలుకూరు బాలాజీ. హెచ్‌–1బీ వీసాల్లో బారత ఆధిపత్యం కొనసాగుతోంది. 70 శాతం భారత ఐటీ వర్కర్లు టీసీఎస్, ఇన్‌ఫోసిస్, విప్రో కోటాలోనే 50 శాతం పొందుతున్నారు. తాజాగా మారిన వీసా నిబంధనలతో మిడిల్‌ క్లాస్‌ జాబ్స్‌ 20 శాతం తగ్గాయి.

టాలెంట్‌ వార్‌లో సంస్కృతికపై దాడి..
భారతీయులు ఐటీలో సూపర్‌ టాలెంటెడ్‌. తక్కువ వేతనాలతో ఎక్కువ పనిచేస్తారు. అమెరికన్లకు ఇది చేతకాదు. అందుకే అక్కడి కంపెనీలు భారతీయులపై ఆసక్తి చూపుతాయి. అయితే ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ నినాదం ఇటు విదేశీయులతోపాటు ముఖ్యంగా భారతీయులు, ఐటీ కంపెనీలపై పడింది. ట్రంప్‌ నిబంధనల కారణంగా చాలా మంది కెనడా, ఆస్ట్రేలియా, యూకేకే వెళ్తున్నారు. అయితే అమెరికా నేతలు మాత్రం తమ చేతగాని తనన్నా అంగీకరించకుండా మన దేవుళ్లపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.

వీసా దేవుడు వివాదం భారత–అమెరికా టాలెంట్‌ వార్‌కు సంకేతం. భారతదేశం స్వయం–నిర్భరతపై దృష్టి పెట్టి, గ్లోబల్‌ మొబిలిటీ అవకాశాలను విస్తరించాలి. అమెరికా మెరిట్‌–బేస్డ్‌ సిస్టమ్‌కు మారితే రెండు దేశాలకు ప్రయోజనం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper