Lifetime Flight Pass: బస్సుల్లో, రైళ్లలో ఎన్నోసార్లు ప్రయాణం చేసి ఉంటాం. కానీ విమానంలో తక్కువసార్లు మాత్రమే ప్రయాణం చేస్తాం. బస్సుల్లో అయితే చిన్నప్పటి నుంచి ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాలేజీ సమయంలో.. ఉద్యోగం చేసే సమయంలో బస్సులే ఆధారంగా ఉంటాయి. అయితే ప్రతిరోజు బస్సులో ప్రయాణం చేసేవారు కాస్త ఖర్చు తగ్గించుకోవడానికి బస్సు పాసులు కొనుగోలు చేస్తారు. అలాగే రైల్లో కూడా రెగ్యులర్గా జర్నీ చేసేవారు రైల్ పాసు కొంటారు. కానీ విమానాల్లో కూడా రెగ్యులర్ గా ప్రయాణం చేస్తూ దీనికి సంబంధించిన పాస్ కొనుగోలు చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. అందులో వ్యక్తి లైఫ్ టైం పాస్ కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేశాడు. ఆ వ్యక్తి ఇప్పటివరకు 3.7 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. ఇంతకీ ఆయన ప్రయాణ విశేషాలు ఏంటంటే?
Also Read: భారతదేశంలో 5 అందమైన రైలు ప్రయాణాలు ఇవీ..
అమెరికాకు చెందిన టామ్ స్టూకర్ అనే వ్యక్తికి జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే ఆయన అమెరికా నుంచి ఆస్ట్రేలియాకు 300 సార్లు విమానంలో ప్రయాణం చేశాడు. తన భార్యతో కలిసి 120 సార్లు హనీమూన్ కు వెళ్ళాడు. వందకు పైగా దేశాల్లో పర్యటించిన తన 36 ఏళ్ల జీవితంలో మొత్తం మూడు పాయింట్ 3.7 కోట్ల కిలోమీటర్లు తిరిగి వచ్చినట్లు చెప్పాడు. ప్రతి ప్రయాణంలో ఖరీదైన హోటలలో బసచేస్తూ.. విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. దాదాపు ప్రపంచాన్ని మూడుసార్లు చుట్టి వచ్చిన ఈయన వయసు ప్రస్తుతం 69 సంవత్సరాలు.
1984వ సంవత్సరంలో టామ్ స్టూకర్ ఒక పని మీద ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి వచ్చింది. అయితే అతను విమానంలో ప్రయాణించడం కొత్తగా అనిపించింది. అంతేకాకుండా ఆ దేశం బాగా నచ్చడంతో అతడికి అక్కడికి వెళ్లాలని అనుకున్నాడు. దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 సార్లు ఇక్కడికి వచ్చాడు. అయితే ఆయన ఇక్కడికి వచ్చింది పనిమీద కాదు. కేవలం విమానంలో ప్రయాణం చేయడానికి.. ఈ దేశాన్ని చూడడానికి.. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు అని ఆస్ట్రేలియా గురించి ఆయన గొప్పగా చెబుతూ ఉంటాడు.
Also Read: నల్ల సముద్రం (Black Sea) లో ఉన్న రహస్యాలు ఏంటో తెలుసా?
అయితే టామ్ స్టూకర్ ఇన్ని ప్రయాణాలు చేస్తే ఎంత ఖర్చవుతుంది? అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. కానీ ముందే చెప్పాము కదా.. అతను విమానం కు సంబంధించి లైఫ్ టైం పాస్ను 1990లో కొనుగోలు చేశాడు.ఆ సమయంలో 290 డాలర్లతో కొనుగోలు చేసిన ఈ పాస్ పై ప్రయాణం చేయడంతో అతనికి దాదాపుగా 20 కోట్ల రూపాయల ఆదాయం సేఫ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎవరైనా సరదా కోసం కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్తారు. కానీ ఈయన మాత్రం కేవలం విమానంలో జర్నీ ఉంటుందనే ఉద్దేశంతోనే ట్రావెల్ చేస్తున్నాడు. అయితే ఈయన ఇంకా జర్నీలో చేస్తాడా? ఇక్కడితో పులిస్టాప్ పెడతాడా? అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఇన్ని కిలోమీటర్లు ఎవరు ప్రయాణించలేదు. దీంతో టామ్ స్టూకర్ రికార్డు సాధించాడు.