Vietnam : నిద్ర అనేది ప్రతీ ఒక్కరికి తప్పనిసరి. ఒక్క రాత్రి నిద్రలేకపోతే (Sleep) ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏదో చిరాకుగా ఉంటుంది. దీనికి తోడు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఒక్క రోజు నిద్రలేకపోతే వరుసగా నాలుగు రోజుల పాటు కొందరు నిద్రపోతారు. అప్పటి వరకు నిద్రపోతే కానీ ఆ అలసట తీరదు. అలాంటి ఈ ప్రపంచంలో ఓ వ్యక్తి మాత్రం కొన్నేళ్ల నుంచి నిద్రపోవడం లేదు. అసలు ఆ మనిషికి పూర్తిగా నిద్ర రాదా.. అంటే రాదు. నిద్రలేకపోయినా (Sleepless) కూడా ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఎలా ఉన్నాడని అనుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడు. సాధారణంగా ఒక మనిషికి తప్పకుండా రోజుకి 8 గంటల నిద్ర అనేది అవసరం. అలాంటిది ఆ వ్యక్తి ఏళ్ల తరబడి నిద్ర లేకుండా ఉన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అసలు ఏళ్ల తరబడి ఎందుకు నిద్రపోవడం లేదు? దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు కూడా మనం ఈ స్టోరీలో చూద్దాం.
వియత్నంకి చెందిన థాయ్ నోక్ అనే వ్యక్తి గత 63 ఏళ్లు నుంచి నిద్రపోవడం లేదు. నిజానికి అతనికి అసలు నిద్ర రావడం లేదు. థాయ్ 1962లో చివరి సారిగా నిద్రపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ నిద్రపోలేదు. ప్రస్తుతం థాయ్ వయస్సు 89 సంవత్సరాలు. రైతు అయిన థాయ్ తన 17 ఏళ్ల వయస్సులో నిద్రపోయాడు. అప్పటి నుంచి ఇప్పటికి అసలు ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. అయితే థాయ్ నోక్‌కి ఓ వ్యాధి ఉండటం వల్ల అతను పూర్తిగా నిద్రపోవడం లేదు. ఏదో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. కానీ దీనిపై ఆధారాలు లేవు. అతనికి నిద్రపట్టడానికి ఎన్నో మందులు వాడటం వంటివి కూడా చేశారు. కానీ థాయ్ సమస్యలకు పరిష్కారం మాత్రం లభించలేదు. అయితే 1962లో థాయ్ నోక్ ఒకసారి మలేరియా బారిన పడ్డాడు. ఆ సమయంలో అతనికి పూర్తిగా నిద్రపట్టలేదు. ఆ తర్వాత ఇదే పూర్తిగా అలవాటు అయ్యింది. ఇతనికి ఉన్న ఒక రకమైన వ్యాధి వల్ల అతను పూర్తిగా నిద్రపోవడం లేదు. ఇన్నేళ్లుగా అతను నిద్రపోవడం లేదంటే.. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు, అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సాధారణంగా ఒక వ్యక్తికి నాలుగు లేదా ఐదు రాత్రులు నిద్రలేకపోతేనే వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. అలాంటిది 63 ఏళ్లుగా కూడా నిద్ర పోకుండా ఆరోగ్యంగా ఉన్నాడంటే మాత్రం ఆశ్చర్య పడాల్సిందే. అయితే నిద్ర లేకపోయినా థాయ్ నోక్ ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్య కారణం తీసుకునే ఆహారం. రోజూ గ్రీన్ టీ తాగడం, వైన్ తాగడంతో పాటు పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అతను ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడు.