Snake Bite : ఈ ప్రపంచంలో ఎన్నో భయంకరమైన పాములు ఉన్నాయి. వీటిని చూస్తేనే చాలా మంది భయపడతారు. నిజానికి పాము కరిస్తే మళ్లీ బతకడం కూడా కష్టమే. వెంటనే చికిత్స తీసుకుంటే పర్లేదు. కానీ లేకపోతే ఒక్కసారే పైకి పోతారు. కొన్ని ప్రమాదకరమైన పాములు కరిస్తే మాత్రం అసలు చికిత్స తీసుకునే ఛాన్స్ కూడా లేదు. వీటి వల్ల పెద్ద జీవులు కూడా వెంటనే చనిపోతాయి. అయితే ప్రపంచంలోని ఓ అత్యంత ప్రమాదకరమైన నల్లపాము ఉంది. దీన్ని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గుర్తించారు. నల్లగా ఉండే ఈ పాము రెండవ ప్రపంచ యుద్ధ చరిత్ర పూటల్లో ఓ మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఎందరో వారి ప్రాణాలు పోయాయి. అయితే ఈ యుద్ధం సమయంలో కేవలం మనుషులు, సైనికులు మాత్రమే కాకుండా ఎన్నో పక్షులు, జంతువులు కూడా చనిపోయాయి. అలాగే ఈ నల్ల పాము కూడా చనిపోయింది. దాదాపు 18 అడుగుల పొడవుగా ఉండే ఈ కింగ్ కోబ్రాను చంపేశారు. చూడటానికి నల్లగా ఉండే ఈ పాము ఎంతో ప్రమాదకరం. నల్లగా ఉన్నప్పటికీ చూడటానికి మాత్రం బాగా ఆకర్షించేది.
ఈ నల్ల నాగుపాము చాలా విషపూరితమైనది. ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాముగా ప్రసిద్ధి చెందిన ఇది.. ఎక్కువగా ఆగ్నేయాసియాలోని దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది. దట్టమైన పొదల మధ్య నివసిస్తుంది. చాలా సునాయాసంగా చెట్లను ఎక్కుతుంది. ఈ పాము ఏనుగు అంత శక్తివంతమైన జీవిని కూడా చంపగలదు. అంతటి విషమైన ఈ పాము చాలా బలంగా ఉంటుంది. ఏనుగును కాటేస్తే.. కొద్ది గంటల్లోనే దాని కండరాలు, చలనం అన్ని ఆగిపోతాయి. ఈ నల్ల నాగు పాము అన్నింటి మీద కాస్త డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఎంతో ప్రత్యేకమైనది కూడా. దీని విషం చాలా ప్రమాదకరం. ఈ పామును మలేషియాలోని పోర్ట్ డిక్సన్ సమీపంలో కూడా దీన్ని ఓసారి బంధించారు. ఈ పాము 12 నుంచి 13 అడుగుల పొడవు పెరుగుతుంది. కానీ ఈ పాము చనిపోయే సమయానికి 18 అడుగుల 8 అంగుళాల పొడవు ఉంది. ఇలాంటి పాములను జూలో కూడా పెంచుతుంటారు. ఎందుకంటే వీటిని చూడటానికి ఎందరో ఆసక్తి చూపిస్తుంటారు. ఆ విధంగానే కొన్ని రోజలు బంధించారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆ పాము చనిపోయింది.
ప్రమాదకరమైన నల్ల పామను జూలో ఉంచారు. యుద్ధం సమయంలో బాంబు దాడి జరిగింది. దీంతో కొన్ని జంతువులు తప్పించుకున్నా.. ఈ పాము మాత్రం చనిపోయింది. జూలో కొన్ని జంతువులును సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. జెయింట్ పాండాలు, ఆసియా ఏనుగులు, ఒరంగుటాన్లు వంటి జంతువులను గ్రామీణ ప్రాంతంలో ఉన్న విప్స్నేడ్ జూకు తరలించారు. కానీ విషపూరితమైన జంతువుల విషయంలో మాత్రం కాలేదు. బాంబుల దాడికి అవి మరణించాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అక్కడ దాదాపుగా 7,50,000 పెంపుడు జంతువులు చనిపోయినట్లు అంచనా వేశారు.