‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శుక్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు. ఇంకా కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. మరి కొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేశంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఆర్థికంగా పుంజుకుంటారు. కొన్ని అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. స్నేహితుల్లో ఒకరి నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు బంధువులతో ఆర్థిక వ్యవహారాలు జరిపితే జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పిల్లల చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. కొత్త వ్యక్తులు పరిచయం అయితే వారితో వెంటనే ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అయితే కొందరు అడ్డంకులు సృష్టించేస్తే వాటిని అధిగమించుకోవాలి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపారులు ఆందోళనగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అన్ని వర్గాల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : చట్ట పరమైన చిక్కుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులు అధికారులతో వాగ్వాదానికి దిగకుండా ఉండాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని పనుల కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. డబ్బు విషయంలో ఇతరులతో జాగ్రత్త ఉండాలి. ముఖ్యమైన పనులు ఇతరులకు అప్పగించకూడదు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తెలుగులో కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై దృష్టి పెట్టాలి.ఎక్కువగా వాదించకూడదు. సాయంత్రం బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారులు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులు ఆర్థికంగా బలపడతారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండే అవకాశం. కొందరు వ్యక్తుల ప్రవర్తన కారణంగా మానసికంగా ఆందోళన చెందుతారు. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. నువ్వు అలా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతర ప్రదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు పొందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటారు. ప్రియమైన వ్యక్తుల కోసం విలువైన బహుమతులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు వాదనలకు దిగకుండా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : రాజకీయాల్లో ఉండే వారికి అనుకూల వాతావరణం. కుటుంబ సభ్యుల సలహాతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. స్నేహితులను కలవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : విదేశీ కంపెనీలతో వ్యాపారం చేసే వారికి ఊహించని లాభాలు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణం లో గడుపుతారు. ఇంకా కాలంగా పెండింగ్లో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఓ విషయంలో ఊహించని మలుపు తిరుగుతుంది.