https://oktelugu.com/

Elephant Muthu Raja : పాపం లంక.. ఏనుగును కాపాడుకోలేకపోయింది… థాయ్‌లాండ్‌కు క్షమాపణ చెప్పింది

క్రమంలో 2001లో థాయ్‌లాండ్‌ రాజు శ్రీలంకు ఓ ఏనుగును బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో దీని వయసు 10 సంవత్సారాలు. దీనిని ఆ ప్రాంతంలో ‘సాక్‌ సురీన్‌’, మైక్‌ సురీన్‌ అని పిలిచేవారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2023 / 10:24 PM IST
    Follow us on

    Elephant Muthu Raja : మనకు బంధువులో లేక స్నేహితులో బహుమతులు ఇస్తే ఏం చేస్తాం? జాగ్రత్తగా దాచుకుంటాం. పదిలంగా భద్రపరుచుకుంటాం. మనకు ప్రత్యేకంగా గుర్తించినందుకు ఆనంద పడతాం. కేవలం మనుషులే కాదు దేశాల మధ్య కూడా ఇలాంటి కానుకలు ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు ఉంటాయి. ఆయా దేశాలు వాటిని జాగ్రత్తగా దాచుకుంటాయి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాటిని బహిర్గతం చేస్తాయి. కానీ, ఓ దేశం ఇచ్చిన బహుమతిని కాపాడుకోవడంలో మన పొరుగును ఉన్న శ్రీలంక కాపాడుకోలేకపోయింది. తిరిగి ఇచ్చేసే స్థాయికి దిగజారింది. అంతే కాదు క్షమాపణ చెప్పేసేంది. అసలు ఆ మాయదారి చైనాతో సాన్నిహిత్యం చేసిన నాటి నుంచే శ్రీలంక పరిస్థితి చేయి దాటి పోయింది. దీనికి తోడు అంతర్గత కలహాలు ఆ దేశాన్ని సర్వభ్రష్టం పట్టించాయి.

    బౌద్ధమతాన్ని ఆచరించే థాయ్‌లాండ్‌ శ్రీలంక మధ్య మొదటి నుంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఈక్రమంలో 2001లో థాయ్‌లాండ్‌ రాజు శ్రీలంకు ఓ ఏనుగును బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో దీని వయసు 10 సంవత్సారాలు. దీనిని ఆ ప్రాంతంలో ‘సాక్‌ సురీన్‌’, మైక్‌ సురీన్‌ అని పిలిచేవారు. మొదట్లో దీనిని బాగానే చూసుకున్నారు. దానికి కాందేవిహారయ గుడిలో ఉంచేవారు. గత కొంతకాలంగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ ప్రభావం ఆ ఏనుగ మీద కూడా పడింది. సరైన పోషణ లేకపోవడంతో ఆ ఏనుగు క్షీణించింది. బరువు బాగా తగ్గింది. ఇదే విషయాన్ని రెరా(ర్యాలీ ఫర్‌ యానిమిల్స్‌ రైట్స్‌ ఎన్విరాన్‌మెంట్‌) అనే సంస్థ థాయ్‌లాండ్‌కు చెప్పింది. అంతే కాదు ముత్తురాజా(శ్రీలంక దేశం ఏనుగుకు పెట్టిన పేరు)తో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ప్రదర్శనలు కూడా చేపడుతున్నారని ఆరోపించింది. దానిని అదుపులో పెట్టే క్రమంలో గాయాలు కూడా చేశారని ‘రెరా’ వాపోయింది. దీంతో ఆ ఏనుగుకు విముక్తి కల్పించాలని శ్రీలకం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ అక్కడి అధికారులకు పట్టించుకోకవడంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం రంగంలోకి దిగింది.

    రెరా సంస్థ విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన థాయ్‌లాండ్‌ ప్రభుత్వం శ్రీలంకలో ఉన్న థాయ్‌ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించింది. ఆ దౌత్య కార్యాలయం విజ్ఞప్తి మేరకు ఆ ఏనుగును కొలంబోలోని నేషనల్‌ గార్డెన్‌కు తరలించారు. అక్కడ అంతంతమాత్రంగా సౌకర్యాలు ఉండటంతో ఏనుగు పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఏనుగును కాపాడే వైద్య సౌకర్యాలు తమ వద్ద లేవని శ్రీలకం చేతులెత్తేయంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం శ్రీలంక మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఇల్యూషిన్‌-2 76 కార్గో విమానంలో దానిని శ్రీలంక నుంచి థాయ్‌లాండ్‌ తీసుకెళ్లింది. ఈ పరిణామం రెండు దేశాల దౌత్య విధానాలపై తీవ్ర ప్రభావం చూపింది. థాయ్‌లాండ్‌ ఏనుగును తీసుకెళ్లడంత పట్ల శ్రీలంక విచారం వ్యక్తం చేసింది. క్షమాపణ కూడా చెప్పింది. బహుమతిగా ఏనుగును ఇస్తే ఇలా చేయడం సరికాదంటూ థాయ్‌లాండ్‌ చురకలు అంటించింది.