Pawan Kalyan – Instagram : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎటువంటిదో అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ను పిచ్చిగా అభిమానించే అభిమానుల సంఖ్య కోట్లలో ఉంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఆయన్ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా లక్షల్లో ఉంది. ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్లో అభిమానులతో టచ్ లో ఉన్న పవన్ కళ్యాణ్.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారు. ఆయన అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది అభిమానులు ఆయన ఖాతాను ఫాలో కావడం ప్రారంభించారు. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు పూనకాలతో ఊగిపోయే అభిమానులకు కొదవేలేదు. సినిమా హీరోగానే కాకుండా దేవుడుగా పూజించే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఆయన కోసం పిచ్చెక్కిపోయే అభిమానులు అయితే కోట్లలో ఉంటారు.
అటువంటి పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేసేందుకు అభిమానులు సిద్ధపడుతుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా క్షణాల్లో రికార్డులను సృష్టించేలా వ్యూస్, లైకులు, షేర్లు కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తుంటాయి. అటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెట్టారు. ఆయన ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా లక్షలాది మంది అభిమానులు ఆయనను ఫాలో కావడం ప్రారంభించారు. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా అభిమానులకు అందుబాటులో ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా అభిమానులకు అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఖాతాను తెరిచారు. ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ చేరిపోయారు.
ఆ స్లోగన్ తో ఇన్ స్టాగ్రామ్ ఖాతా..
ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో.. జైహింద్’ అనే స్లోగన్ ను ఖాతాకు చేర్చారు. ట్విట్టర్ ఖాతాకు జత చేసిన ప్రొఫైల్ ఫోటోనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు కూడా వినియోగించారు. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ వేదికగా రాజకీయాలతోపాటు సినిమా విశేషాలను కూడా పంచుకునేందుకు ఖాతాను ఓపెన్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య 1.4 మిలియన్లుకు చేరింది. ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా ఇన్ని లక్షల మంది ఫాలో కావడం ద్వారా సరికొత్త రికార్డును ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేశారంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందులో అడుగుపెడితే అందులో రికార్డులు సృష్టించడం ఖాయం అంటూ పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.