Homeఅంతర్జాతీయంElon Musk: ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయవచ్చు.. ఎలానో మరో బాంబు పేల్చిన ఎలన్ మస్క్

Elon Musk: ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయవచ్చు.. ఎలానో మరో బాంబు పేల్చిన ఎలన్ మస్క్

Elon Musk:  ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారు. ట్రంప్‌ గెలిస్తే.. మస్క్‌ మంత్రి అయ్యే అకవాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మద్దతుగా మస్క్‌ తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మస్క్‌ కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రంప్‌ను గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియాలో ట్రంప్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మస్క్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారత్‌లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే అమెరికాలో బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మనం ఈవీఎంలను వాడుతున్నామని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందన్న ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మస్క్‌ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

మస్క్‌ ఏమన్నాడంటే..
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌) సాయంతో ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని ఆరోపించారు. ఓ టెక్‌ నిపుణుడిగా తనకు ఉన్న పరిజ్ఞానవంతో ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించొద్దని సూచించారు. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బ్యాలెట్‌ పేపనర్‌ను ఎవరూ హ్యాక్‌ చేయలేరని స్పష్టం చేశారు. ఓట్లను చేతులతోనే లెక్కించాలని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఎలాన్‌ మస్క్‌ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ప్రధానంగా భారతీయ ఫాలోవర్లే ఎక్కువగా కామెంట్లు పెడుతున్నారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని చాలా మంది కామెంట్‌ చేశారు. టెన్నాలజీని వాడుకోవాలి కదా అని కొందరు పేర్కొన్నారు. అప్‌డేట్‌ అయ్యేదెప్పుడు అని మరికొందరు కామెంట్‌ చేశారు.

భారత్‌లో చర్చ..
ఇదిలా ఉంటే.. మస్క్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్‌లోని రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ఇటీవల జరిగిన హర్యాన ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ తరుణంలో మస్క్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు బలంగా మారాయి. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించొద్దని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మస్క్‌ మాటలతో అయినా వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version