https://oktelugu.com/

Renu Desai : పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్..మనుషులు లాగా ప్రవర్తించండి అంటూ సంచలన కామెంట్స్!

ఈమె సోషల్ మీడియా లో ఈమధ్య ఎక్కువ మూగ జీవాల బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే విజయవాడ వరద కారణంగా ఎంతో మంది తీవ్రమైన ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని మూగ జీవాలు వరదలో చిక్కుకొని సహాయసహకారాలు అందక దిక్కు తోచని స్థితిలో ఉన్న కొన్ని వీడియోలో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 20, 2024 / 04:52 PM IST

    Renu Desai

    Follow us on

    Renu Desai : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాగానే, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కి కూడా సమాజం పట్ల ప్రేమ, సేవ స్ఫూర్తి ఉన్న మనిషి అనే విషయం అందరికీ తెలిసిందే. బహుశా ఆమెలో ఈ లక్షణాలు ఉండడం వల్లే అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఉండొచ్చు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా విడిపోయి ఉండొచ్చు, అది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇద్దరూ ఇప్పటికీ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటారు, అభిమానించుకుంటారు. రేణు దేశాయ్ ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడింది, అంతే కాకుండా ఈ ఎన్నికల ముందు కూడా ఆమె తన భర్త కి సపోర్టు చేస్తూ ఒక వీడియో విడుదల చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇంస్టాగ్రామ్ లో నిత్యం యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్, ఆపదలో ఉన్నవారికి సహాయం అందించడం, సమాజం లో జరిగే అన్యాయాల గురించి ఎప్పటికప్పుడు తన గొంతుని వినిపించడం, అంతే కాకుండా మూగ జీవాల మీద ఈమె చూపించే ప్రేమ ఎనలేనిది అని చెప్పొచ్చు.

    పెంపుడు కుక్కలను దత్తత తీసుకోవడం, వాటికి ఆహరం అందించడం వంటివి చేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా ఈమె సోషల్ మీడియా లో ఈమధ్య ఎక్కువ మూగ జీవాల బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే విజయవాడ వరద కారణంగా ఎంతో మంది తీవ్రమైన ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని మూగ జీవాలు వరదలో చిక్కుకొని సహాయసహకారాలు అందక దిక్కు తోచని స్థితిలో ఉన్న కొన్ని వీడియోలో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా రేణు దేశాయ్ వాటిని తన స్టోరీ లో అప్లోడ్ చేసి పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడు ని ట్యాగ్ చేసి, దయచేసి ఈ విపత్తుకరమైన సందర్భంలో మూగజీవాలను కూడా ఆదుకోండి అంటూ అభ్యర్దించింది.

    అంతే కాకుండా ఒక వ్యక్తి కుక్కని అతి దారుణంగా హింసించడం చూసిన రేణు దేశాయ్, ఆ వీడియో కూడా షేర్ చేస్తూ ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందిగా కోరింది. మనుషులు రోజురోజుకి చాలా స్వార్థం గా మారిపోయారని, తమ చుట్టూ ఉండేవాడిని నాశనం చేస్తున్నారని, మానవత్వం నశించిపోతుంది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాదు ఇటీవలే పవన్ కళ్యాణ్ సనాతన దర్మం మీద దేశ వ్యాప్తంగా తన గొంతుకని వినిపిస్తూ వారాహి డిక్లరేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పరోక్షంగా రేణు దేశాయ్ సపోర్ట్ చేస్తూ సెక్యులరిజం అంటే కేవలం కొన్ని మతాలకు మాత్రమే పరిమితమైందని ఆమె చెప్పుకొచ్చింది. భారత దేశంలో చర్చీలు, మస్జీద్ లు ప్రభుత్వ ఆదీనంలో ఉండవని, కానీ హిందూ దేవాలయాలు మాత్రం ప్రభుత్వ ఆదీనం లో ఉంటాయని, ఇదెక్కడి సెక్యులరిజం అంటూ ఆమె ప్రశ్నించారు. ఆమె మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.