Cape Town: పెనుగాలుల బీభత్సం.. యుగాంతం జస్ట్ శాంపిల్ గా కనిపించింది.. వైరల్ వీడియో

దక్షిణాఫ్రికా పేరు చెప్పగానే.. దట్టమైన అటవీ ప్రాంతాలు గుర్తుకొస్తాయి.. దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ కు సమీపంలోనే దట్టమైన అరణ్యాలున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : April 8, 2024 9:27 am

Cape Town

Follow us on

Cape Town: అప్పటిదాకా అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఎండ కూడా పెద్దగా లేదు. ఉన్నట్టుండి చిన్న గాలి ప్రారంభమైంది. ఆ తర్వాత అది తీవ్ర రూపు దాల్చింది. ఎంతలా అంటే చుట్టుపక్కల ఉన్న ఇళ్ల రేకులు కొట్టుకుపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు వేళ్ళతో సహా నేల కూలిపోయాయి. కార్లు, పెద్దపెద్ద కంటైనర్లు కొట్టుకుపోయాయి. ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో? ఎంతమంది నిరాశ్రయులయ్యారు? ఎంతస్థాయిలో ఆస్తి నష్టం జరిగిందో? ఇప్పటికైతే తెలియదు.. ఆ గాలి వీచిన తీరు చూస్తే యుగాంతం కళ్ళ ముందు కనిపించినట్టుగా అనిపించింది. సాధారణంగా ఇలాంటి గాలులు వీచినప్పుడు వర్షం కురుస్తుంది. కానీ అక్కడ అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. పైగా చాలా వరకు ఇళ్ళు కూలిపోయాయి. ఈ సంఘటన సౌత్ ఆఫ్రికా రాజధాని కేప్ టౌన్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

దట్టమైన అటవీ ప్రాంతాల వల్లేనా..

దక్షిణాఫ్రికా పేరు చెప్పగానే.. దట్టమైన అటవీ ప్రాంతాలు గుర్తుకొస్తాయి.. దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ కు సమీపంలోనే దట్టమైన అరణ్యాలున్నాయి. ఇలాంటి గాలులు సర్వసాధారణమే. కానీ ఈ స్థాయిలో గాలులు వీచిన చరిత్ర ఆ దేశంలో ఇప్పటివరకు లేదు. వర్షాలు లేదా తీవ్ర దుర్భిక్షం, ఎముకలు కొరికే చలి వంటి వాతావరణాలను అక్కడి ప్రజలు చవిచూశారు గాని.. ఇంతవరకు ఈ స్థాయిలో పెనుగాలులను ఎదుర్కోలేదు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. రాజధాని కేప్ టౌన్ మాత్రమే కాకుండా.. దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా పెనుగాలులకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.. చాలామంది ఇళ్ళ పై కప్పులు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. కరెంట్ తీగలు చెల్లాచెదురుగా పడిపోయాయి.. చివరికి తాగునీటి పైపులైన్లు కూడా పగిలిపోయాయి. ఇళ్లపై ఏర్పాటుచేసిన రేకులైతే గాలుల తీవ్రతకు కొట్టుకుపోయాయి. దట్టమైన అరణ్యాల వల్లే ఇలాంటి గాలులు వీచాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

చూస్తుండగానే లోయలో పడ్డాయి

గాలుల తీవ్రతకు హైవేల మీద ప్రయాణిస్తున్న వాహనాలు అమాంతం కొట్టుకుపోయాయి.. దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ కు సమీపంలో ఒక పెద్ద నీటి కాలువ ఉంటుంది. ఆ కాలువ మీదుగా ఒక వంతెన నిర్మించారు. ఆ వంతెన పైనుంచి హైవే ఏర్పాటు చేశారు. దాని మీదుగా వాహనాలు రాజధాని కేప్ టౌన్ లోకి ప్రవేశిస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ఈ రోడ్డే ప్రధాన మార్గం. అయితే అనూహ్యంగా వీచిన గాలుల వల్ల భారీ వాహనాలు సైతం కొట్టుకుపోయి కాలువలో పడ్డాయి. పెద్ద పెద్ద కంటైనర్లు కూడా అమాంతం గాల్లోకి ఎగిరి కింద పడ్డాయి.. వీటికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ” వామ్మో ఏంటి ఆ గాలులు.. చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. యుగాంతం కళ్ళ ముందు కనిపిస్తోంది. ఎంతమంది చనిపోయారో? ఎన్ని వాహనాలు ధ్వంసమయ్యాయో? ఎన్ని ఇళ్ళు కూలిపోయాయో? అక్కడి ప్రజలు ఎలా ఉన్నారో? టోర్నడోలు అంటాం గాని.. ఇవి అంతకుమించి అనేలాగా ఉన్నాయని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ స్థాయిలో గాలులు ఎందుకు విచాయో వాతావరణ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.. గాలుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గాలులతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని.. అందువల్ల ప్రజలు బయటకు రాకపోవడమే ఉత్తమమని హెచ్చరికలు జారీ చేశారు.