Site icon OkTelugu

Dhurandhar 2 Vs Ustaad Bhagat Singh: ‘ధురంధర్ 2’ vs ‘ఉస్తాద్ భగత్ సింగ్’..ఈ రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంత వచ్చిందంటే!

Ustaad Bhagat Singh vs Dhurandhar 2

Ustaad Bhagat Singh vs Dhurandhar 2

Dhurandhar 2 Vs Ustaad Bhagat Singh: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మూవీ లవర్స్ లో ‘ధురంధర్ 2 : ది రివెంజ్'(Dhurandhar 2 : The Revenge) చిత్రం పై ఉన్నంత క్రేజ్ , ఏ సినిమా మీద లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చి 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీ పై మొదటి నుండి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా రన్ టైం దాదాపుగా 4 గంటల వరకు ఉంటుందని తెలిసినా కూడా ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎగబడుతున్నారు. సాధారణంగా బాలీవుడ్ చిత్రాలకు ప్రీమియర్ షోస్ వేయరు. కానీ ఈ చిత్రానికి వేశారు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రేమీస్ + మొదటి రోజు కలిపి 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తోంది.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ లో #RRR , ‘పుష్ప 2’, ‘ఓజీ 2’ చిత్రాలకు మాత్రమే ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. వాటి తర్వాత ఈ చిత్రానికే ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. మరోపక్క ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం కూడా ‘ధురంధర్ 2 ‘ విడుదలైన రోజున విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయిల వరకు జరిగిందని టాక్. నిన్న రాత్రి నే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించడం మొదలు పెట్టారు. రేపు రాత్రి ఎండింగ్ లోపు ఈ చిత్రానికి 50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఓవరాల్ గా మొదటి రోజు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తుంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ కి 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉండగా, ధురంధర్ 2 చిత్రానికి 150 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది మామూలు ర్యాంపేజ్ కాదు. హిందీ సినిమాలకు ఇప్పటి వరకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. దీనిని బట్టీ ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఊపు చూస్తుంటే కేవలం మొదటి వారం లోనే ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Exit mobile version