Homeఅంతర్జాతీయంPakistan hospital attack India reaction: పాకిస్తాన్‌ దాడి.. భారత్‌ సీరియస్‌

Pakistan hospital attack India reaction: పాకిస్తాన్‌ దాడి.. భారత్‌ సీరియస్‌

Pakistan hospital attack India reaction: ప్రపంచంలో ఒకవైపు ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం జరుగుతోంది. ఇంకోవైపు ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ వార్‌ భీకరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సందెట్లో సడేమియాలాగా పాకిస్తాన్‌ తన పొరుగుదేశం ఆఫ్గానిస్తాన్‌పై తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌ పాకిస్తాన్‌ పేరుతో వైమానిక దాడులు చేస్తోంది. వీలుచిక్కినప్పుడల్లా దాడుల చేస్తోంది. పాకిస్తాన్‌ చేసే దాడుల్లో ఉగ్రవాదులకన్నా సామాన్యులు, పిల్లలు, మహిళలే చనిపోతున్నారు. తాజాగా కాబూల్‌ సమీపంలోని ఆస్పత్రిపై దాడి చేసింది. ఇందులో 400 మంది మృతిచెందారు. 250 మందికిపైగా గాయపడ్డారు. యుద్ధాల సమయంలో ఆఫ్గానిస్తాన్‌పై దాడిచేస్తే తమను ఎవరూ పట్టించుకోరని పాకిస్తాన్‌ భావిస్తోంది.

సీరియస్‌ అయిన భారత్‌..
పాకిస్తాన్‌ ఆస్పత్రిపై దాడి చేయడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌ చర్యపై సీరియస్‌ అయింది. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్‌ మాసంలో మరో ముస్లిం దేశమైన పాకిస్తాన్‌ అమాయకులను చంపడాన్ని ఖండింది. అమాయక పౌరులపై జరిగిన కాబూల్‌ దాడిని అఫ్గాన్‌ సార్వభౌమత్వ ఉల్లంఘనగా, మారణహోమంగా వర్ణించింది.

దాడిలో సామాన్యులు మృతి..
కాబూల్‌లోని మాదకద్రవ్య విముక్తి కేంద్రం (డ్రగ్‌ రిహాబ్‌ సెంటర్‌)పై సోమవారం పాక్‌ వైమానిక దాడి జరిగింది. ఆస్పత్రి పూర్తిగా ధ్వంసమైంది. తాలిబాన్‌ మీడియా ప్రకారం 400 మంది మరణించారు, 250 మందికిపైగా గాయపడ్డారు. శిథిలాల్లో చిక్కున్న వారు ఇంకా ఉన్నారని ఆరోగ్య శాఖ ప్రతినిధి షరాఫత్‌ జమాన్‌ తెలిపారు.

Also Read: అప్ఘనిస్తాన్ పై పాక్ భీకర దాడి.. 400 మంది దుర్మరణం..ఇవేం ఆడంగి వేషాలురా ఆసిమ్‌!

పిరికిపంద చర్య..
భారత్‌ ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. ఉగ్రవాదులను ఎదుర్కొనే ధైర్యం లేక పాకిస్తాన్‌ ఇలా సామాన్యులను టార్గెట్‌ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అంతర్జాతీయ మానవత్వ చట్టాలకు విరుద్ధమని, పౌర స్థావరాలపై లక్ష్య దాడిగా పేర్కొంది. పాక్‌ దాడులు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారాయని హెచ్చరించింది. ఇదిలా ఉంటే తాము దాడి చేయలేదని మొదట బుకాయించిన పాకిస్తాన్‌ ఇప్పుడు తాలిబాన్‌ ఆయుధ గిడ్డంగులు, సైనిక స్థావరాలపై దాడిచేసినట్లు తెలిపింది. సామాన్యులకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సమాచార శాఖ ప్రకటించింది.

దాడికి కారణం..?
పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దు (డ్యూరాండ్‌ లైన్‌) వద్ద ఘర్షణలు మూడో వారానికి చేరాయి. తాలిబాన్‌ ప్రతీకార కాల్పుల్లో పాక్‌ సైనికులు చనిపోయారు. ఇటీవల పాక్‌ 7 ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పౌరులు మరణిస్తుండడంతో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.

భారత వ్యూహాత్మక ప్రాధాన్యత
భారత్‌ అఫ్గాన్‌తో సంబంధాలను బలోపేతం చేస్తూ పాక్‌ విస్తరణవాదాన్ని ఎదిరించింది. దక్షిణ ఆసియాలో స్థిరత్వం కోసం మానవీయ సహాయం, ఐక్యరాజ్యసమితి ద్వారా ఒత్తిడి తీసుకుంటోంది. ఇది భారత విదేశాంగ విధానంలో కొత్త మలుపుగా కనిపిస్తోంది. తద్వారా పాకిస్తాన్‌ను ఇరకాటంలో పెట్టాలని పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version