Prashant Kishor
Prashant Kishor: ఏపీ సీఎం జగన్ కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి షాక్ ఇచ్చారు. సరిగ్గా ఎన్నికల ముంగిట కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో జగన్ గెలవరని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు చాన్స్ లేదని తేల్చేశారు. తాజాగా ఓ డిబేట్లో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో జగన్ ముందుకు సాగారు. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిషోర్ జగన్ కు దూరమయ్యారు. ఆయన ఐపాక్ టీం మాత్రం జగన్ కు పనిచేస్తోంది. ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్రశాంత్ కిషోర్.. జగన్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. జగన్ పాలన పై తరచూ మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట ఇరుకున పెట్టేలా మాట్లాడారు. జగన్ ఓడిపోతారని తేల్చి చెప్పడం విశేషం.
దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ సుపరిచితం. దేశవ్యాప్తంగా చాలా పార్టీలకు ఆయన పనిచేశారు. అధికారంలోకి తీసుకు రాగలిగారు. గత ఎన్నికలకు ముందు జగన్ ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్నారు. ప్రజలను వర్గాలుగా విభజించి జగన్ వైపు టర్న్ అయ్యేలా పీకే చక్కగా పనిచేశారు. ఏపీలో ఆయన వ్యూహాలు సైతం వర్కౌట్ అయ్యాయి.టిడిపి ప్రభుత్వాన్ని డి గ్రేడ్ చేయడంలో పీకే సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దీంతో జగన్ కు ఏకపక్ష విజయం సొంతమైంది. అయితే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ జగన్ ఓడిపోబోతున్నారని తేల్చి చెప్పడం సంచలనంగా మారింది.హైదరాబాదులో జరిగిన ఓ డిబేట్లో ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడారు. అందులో భాగంగా ఏపీలో నెలకొన్న పరిస్థితులపై విశ్లేషణ చేశారు.
ఏపీలో జగన్ పాలన బాగాలేదని.. కేవలం ఆయన ప్రొవైడర్ గానే మిగిలిపోయారని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు డబ్బులు పంచడం ద్వారా ఎన్నికల్లో గెలిచేద్దామని జగన్ భావిస్తున్నారని.. కానీ అది సాధ్యమయ్యే పని కాదని తేల్చేశారు. అధికారంలో వచ్చిన నాటి నుంచి ప్రజలను కేవలం పుచ్చుకునే వారిగా.. తాను ఇచ్చే వాడిగా మాత్రమే చూసుకున్నారని.. ఇది ఒక రకంగా ప్రజలను చేతులు చాచి నిలబడేలా చేసిందని పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాచరిక పాలనలోరాజులు ఇదే మాదిరిగా చేశారని.. తమ పుట్టినరోజులు.. పెళ్లిరోజు నాడు ఉచితాలు పంపిణీ చేసే వారిని గుర్తు చేశారు. ఇటువంటి చర్యలు ఓట్లు తెచ్చి పెట్టవని తేల్చి చెప్పారు. ఏపీ ప్రజలు ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో అభివృద్ధి లేదన్నది బలమైన వాదన అని.. దానిని తాను ఏకీభవిస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీకి పని చేసిన ప్రశాంత్ కిషోర్.. ఇటీవల టిడిపికి దగ్గరయ్యారు. ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ఆయన చంద్రబాబును కలిసి చర్చించారు. ఆయనతోనే భోజనం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే అప్పటినుంచి ప్రశాంత్ కిషోర్ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం కనిపిస్తోంది. అయితే ఇది తెలుగుదేశం పార్టీతో ఒప్పందంలో భాగమని వైసిపి ఆరోపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ మాత్రం దేశ రాజకీయాలతో పాటు ఏపీ గురించి ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. వైసీపీని డీగ్రేడ్ చేసేలా మాట్లాడుతున్నారు. అయితే ఆయన మాటల్లో వాస్తవం ఉందా? లేకుంటే టీడీపీ ప్రభావితం చేస్తోందా? అన్నది ఎన్నికల్లో తేలనుంది.