funeral crisis Thailand : ప్రకృతి విపత్తు చోటు చేసుకున్నప్పుడు మనుషులు తీవ్రంగా ప్రభావితమవుతారు. ఇక జంతువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుషుల వల్ల ఏర్పడిన విపత్తులైతే చాలా దారుణంగా ఉంటాయి. మనుషుల వల్ల చోటు చేసుకున్న విపత్తులు ఈ ప్రపంచాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేశాయి. లక్షల మంది ఈ విపత్తుల వల్ల చనిపోయారు. లక్షల కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ విపత్తులకు సంబంధించిన ప్రభావాలను ఈ ప్రపంచం ఇప్పటికీ ప్రత్యక్షంగా.. పరోక్షంగా చవి చూస్తూనే ఉంది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. వాస్తవానికి పశ్చిమాసియాలో అత్యంత కీలకమైన వనరులు ఉన్నాయి. అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలవు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉన్న దేశాలలో విస్తారంగా చమురు.. గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వీటి ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న దేశాలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయి. ఇరాన్, ఇరాక్, సిరియా.. ఇలా చెప్పుకుంటూ పోతే గల్ఫ్ దేశాలు మొత్తం కేవలం ఆయిల్ మీదనే ఆర్థిక వ్యవస్థను కొనసాగిస్తున్నాయి.
ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. గల్ఫ్ దేశాలలో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈ యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. యుద్ధం వల్ల చమురు.. గ్యాస్ రంగాలు మాత్రమే కాకుండా.. ఇతర రంగాలు కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. గల్ఫ్ యుద్ధం వల్ల ఇప్పుడు అంత్య క్రియలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా థాయిలాండ్ దేశంలో డీజిల్ కొరత వల్ల ఓ ప్రముఖ ప్రాంతంలో జరిగే అంత్యక్రియలను పూర్తిగా నిలిపివేశారు.
థాయిలాండ్ లోని నకోన్ ఫానోమ్ ప్రాంతంలో వాట్ మహా థాట్ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ డీజిల్.. కరెంటు ద్వారా శవాలకు అంత్యక్రియలు జరుపుతారు. గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధం వల్ల థాయిలాండ్ దేశంలో డీజిల్ కొరత ఏర్పడింది. గ్యాస్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. దీంతో థాయిలాండ్ ప్రభుత్వం నిబంధనలను అత్యంత కఠిన తరం చేసింది. గ్యాస్.. డీజిల్ లభించడం లేదు. దీంతో అంత్యక్రియలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా శవాలకు అంత్యక్రియలు చేయడం అత్యంత కష్టంగా మారిపోయింది..
“ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఎన్నడూ అనుకోలేదు. గ్యాస్ అందుబాటులో లేదు. డీజిల్ లభించడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. పర్యావరణహితంగా కొంతకాలంగా డీజిల్, కరెంట్ ద్వారా శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. అయితే ఇప్పుడు వాటి కొరత వల్ల అంత్యక్రియలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని” వాట్ మహా థాట్ ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.