Pawan Kalyan comments : ఈ ఏడాది జనవరి 9 న సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వాల్సిన తమిళ హీరో విజయ్ ‘జన నాయగన్’ చిత్రానికి సెన్సార్ బోర్డు అభ్యంతకరమైన సన్నివేశాలు పెట్టినందుకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. కోర్టు లో ఈ అంశంపై చాలా రోజుల వరకు చర్చలు నడిచాయి. చివరికి మేకర్స్ కిందకు దిగొచ్చి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలను తొలగించడానికి రెడీ అయింది . కానీ ఆ తర్వాత సెన్సార్ సభ్యులలో ఒకరు అనారోగ్యం పాలవ్వడం తో స్క్రీనింగ్ వాయిదా పడింది. మళ్లీ సెన్సార్ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతుందో, ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అభిమానులకు అంతు చిక్కని పరిస్థితి. CBFC అంటే సెంట్రల్ గవర్మెంట్ కి సంబంధించినది కాబట్టి, అక్కడ ప్రస్తుతం బీజేపీ పవర్ లో ఉండడం వల్ల, విజయ్ బీజేపీ కి వ్యతిరేకం కాబట్టి, కావాలని రాజకీయం చేసి ఆపుతున్నారు అంటూ ప్రచారం జరిగింది.
ఈ అంశంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘అందులో ఎలాంటి నిజం లేదు. ఇప్పుడు నేను బీజేపీ పార్టీ తోనే పొత్తులో ఉన్నాను, CBFC నా ఓజీ చిత్రానికి చివరి రోజు వరకు ఎదురు చూసేలా చేయించి A సర్టిఫికేట్ ఇచ్చింది. అందుకు నేనేమి అనుకోవాలి ‘ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా రీసెంట్ గా విజయ్ ని NDA లోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని, విజయ్ తో చర్చలు జరుపుతున్నదంటూ సోషల్ మీడియా లో ఒక వార్త ఏ రేంజ్ లో ప్రచారం అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ విషయం పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘విజయ్ ని నేను పాతికేళ్ల క్రితం కలిసాను. ఇప్పటి వరకు కనీసం ఫోన్ లో కూడా మేము మాట్లాడుకోలేదు. NDA తరుపున నేను మధ్యవర్తిత్వం వహించాను అనడంలో ఎలాంటి నిజం లేదు. అసలు ఈ వార్త ఎలా పుట్టిందో కూడా అర్థం కావడం లేదు ‘అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.