Peru : దక్షిణ అమెరికా దేశం పెరూ. దీని రాజధాని లిమా(Lima). వందల ఏళ్ల చరిత్ర ఉన్న పెరూలో అనేక చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. రిమాక్ నది వెంట అనేక కట్టడాలు నిర్మించారు. ఇటీవల రిమాక్(Rimak) నదిపై నిర్మించిన 16వ శతాబ్దపు వంతెన బయట పడింది. దీనిని కేవలం ఇటుకలతో నిర్మించడం ఇంకా విశేషం. ‘ప్యూంటే డి పియడ్రా‘ (Vyoonte D.Piyadra) అని పిలవబడే వంతెన ఇది. దీనిమీదుగానే నాడు రాకపోకలు సాగిచేవారు. ఈ వంతెనను 1610లో స్పానిష్ వైస్‌రాయ్ జువాన్ డి మెన్డోసా వై లూనా ఆధ్వర్యంలో నిర్మించారు, ఇది కచ్చితంగా 17వ శతాబ్దం ప్రారంభంలోనిది అయినప్పటికీ, దీని నిర్మాణ శైలి, చారిత్రక నేపథ్యం 16వ శతాబ్దం చివరి భాగంలోని స్పానిష్ వాస్తుశిల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వంతెన లిమా పాత నగర కేంద్రాన్ని (సెర్కాడో డి లిమా) రీమాక్ జిల్లాతో కలుపుతుంది. ఇటుకలు, రాయితో నిర్మితమై ఉంటుంది. ఇది పెరూలో స్పానిష్ వలస కాలంనాటి ముఖ్యమైన నిర్మాణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
తవ్వకాల్లో ఇవి కూడా..
ఇక వంతెన తవ్వకం పనులు జరుగుతుండగా నాణేలు, పాత్రలు కూడా బయటపడ్యా. వెంతనను పూర్తిస్థాయిలో వెలికి తీయడానికి కొంత సమయం పడుతుందని ఆర్కియాలజీ(Arkiyalogy) అధికారులు పేర్కొంటున్నారు. ఈ వంతెన కేవలం 5 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంది. తవ్వకాలు జరుపుతుండగా మార్కుబినాస్ అని పిలిచే 15 వెండి నాణేలు బయటపడ్డాయి. సరైన ఆకారంలో లేని ఈ నాణేలపై స్పానిష్ రాజముద్రలు ఉన్నాయి. వీటితోపాటు వైన్, మద్యం భద్రపర్చేందుకు ఉపయోగించే పాత్రలు ఉన్నాయి. పెరూ రాజధాని లిమాలోని అధ్యక్ష భవనం సమీపంలోనే దీనిని గుర్తించారు. ప్రయాణికులు, పొరుగు నగరాలవాసులు, సన్యాసులు, యాచకులు తదితరులు ఈ వంతెన మీదుగానే రాకపోకలు సాగించేవారట.
Also Read : తగ్గిన భారత పర్యాటకులు.. దారుణంగా మాల్దీవులు పరిస్థితి.. ఈ ఏడాది కొత్త లక్ష్యాలతో ముందుకు
ఆధారాలు తక్కువ..
16వ శతాబ్దంలోనే పూర్తిగా నిర్మించబడిన వంతెనల గురించి స్పష్టమైన ఆధారాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లిమా స్థాపన తర్వాత మొదటి శతాబ్దంలో నగర విస్తరణ క్రమంగా జరిగింది. అయితే, ప్యూంటే డి పియడ్రా వంటి నిర్మాణాలు ఆ కాలంనాటి సాంకేతికత, ఇటుకల వినియోగాన్ని చూపిస్తాయి.