Bangalore : ఆర్థిక మాద్యం(Econmy Crisis) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాలు తగ్గిపోతుండగా, ఉన్న ఉద్యగాలు కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికే ఐటీరంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. నైపుణ్యం లేనివారు(Un skilld) ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. ఐఐటీల్లో చదివిన వారు కూడా తక్కువ వేతనాలకు పనిచేయాల్సిన పరిస్థితి. ఇక క్యాంపస్ డ్రైవ్(Campus Dirve)లు చాలా వరకు తగ్గిపోయాయి. రెజ్యూమ్‌లు కూడా భిన్నంగా, ఆకట్టుకునేలా తయారు చేయాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో బెంగళూర్(Banglur)కు చెందిన ఓ కంపెనీ ఫౌండర్ ఏడాది రూ.40 లక్షల వేతనం.. వారానికి ఐదు రోజులు ఆఫీస్ నుంచి పని ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టాడు. విద్యార్హతలు కూడా మంచి కాలేజీ నుంచి రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఎలాంటి అనుభవం కూడా ఉండనక్కర్లేదని తెలిపాడు. కనీసం రెజ్యూమ్‌తో కూడా పని లేదని వెల్లడించారు. దరఖాస్తు కూడా చేసుకోవనంసరం లేదని తెలిపాడు.
ఆసక్తిగా పోస్టు..
బెంగళూరులోని ఇందిరానగర్‌లో తమ కార్యాలయానికి సున్నా నుంచి రెండేళ్ల వరకు అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నియమించుకోవాలని చూస్తున్నట్లుస్మాలెస్ట్ ఏఐ కంపెనీ అధినేత సుదర్శన్ కామత్(Sudarshn Kamath)తెలిపారు. స్మాలెస్ట్ ఏఐ కంపెనీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో క్రాక్డ్ ఫుల్ స్టాక్ ఇంజినీర్‌ను నియమించాలని చూస్తున్నామని వెల్లడించారు. మిమ్మల్ని పనిచయం చేసుకుంటూ ఒక చిన్న వంద పదాల టెక్ట్స్ పంపాలని పేర్కొన్నాడు. మీది ఏ కాలేజీ అనేది ముఖ్యం కాదని కూడా తెలిపారు.
Also Read : కొత్త సంవత్సరంలో భారీ ఉద్యోగాలు.. ఎందులో ఎన్ని ఖాళీలు? విద్యార్హత, అప్లే వివరాలు
క్రాక్డ్ ఇంజినీర్స్ అంటే..
ఇక్కడ క్రాక్డ్ ఫుల్ స్టాక్ ఇంజినీర్స్ అని సుదర్శన్ పేర్కొన్నారు. క్రాక్డ్ ఇంజినీర్స్ అనేది నూతన మార్పులకు, కొత్త ఆలోచనలకు భయపడని అత్యంత సమర్థనీయులైన, ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లని వర్ణించడానికి ఉపయోగించే పదం. ఈ పోస్టు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఆకట్టుకునే రెజ్యూమ్ కంటే నైపుణ్యాలు కామత్ ప్రాధాన్యత ఇచ్చారని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే క్రాక్డ్ ఇంజినీర్‌కు ఈ జీతం చాల తక్కువ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.