Homeఎంటర్టైన్మెంట్Rashi Khanna: హీరోయిన్ రాశీ ఖన్నా కి మరో బంపర్ ఛాన్స్.. అదృష్టం అంటే ఇదే!

Rashi Khanna: హీరోయిన్ రాశీ ఖన్నా కి మరో బంపర్ ఛాన్స్.. అదృష్టం అంటే ఇదే!

Rashi Khanna: మన టాలీవుడ్ లో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్స్ చాలా అరుదు. అలా అరుదైన హీరోయిన్స్ లో ఒకరు రాశీ ఖన్నా(Rashi Khanna). ‘ఊహలు గుసగుసలాడే ‘ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఆమె, ఆ తర్వాత కుర్ర హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. స్టార్ హీరో ఇప్పటి వరకు ఈమె ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ అవకాశాలు ఇచ్చారు. ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘జై […]

Rashi Khanna: మన టాలీవుడ్ లో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్స్ చాలా అరుదు. అలా అరుదైన హీరోయిన్స్ లో ఒకరు రాశీ ఖన్నా(Rashi Khanna). ‘ఊహలు గుసగుసలాడే ‘ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఆమె, ఆ తర్వాత కుర్ర హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. స్టార్ హీరో ఇప్పటి వరకు ఈమె ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ అవకాశాలు ఇచ్చారు. ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘జై లవకుశ’ మూవీ లో ఒక హీరోయిన్ గా నటించిన రాశీ ఖన్నా , కెరీర్ లో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. కానీ ఎందుకో కాలం కలిసి రావడం లేదు. కానీ ఇప్పుడు ఆమెకు పరిస్థితులు అనుకూలించినట్టు తెలుస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం మరో నాలుగు రోజుల్లో మన ముందుకు రాబోతుంది.

Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!

ఈ సినిమా హిట్ అయితే రాశీ ఖన్నా కెరీర్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తోంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే రాశీ ఖన్నా మరో బంపర్ ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే అల్లు అర్జున్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో కీలకమైన నెగెటివ్ రోల్ కి రాశీ ఖన్నా ని సంప్రదించారట మేకర్స్. ఆమె క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో మూవీ అంటే, వెయ్యి కోట్ల వసూళ్లను కొల్లగొట్టే రేంజ్ మార్కెట్ అన్నమాట. అంత పెద్ద సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించే ఛాన్స్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఈ సినిమా హిట్ అయితే రాశీ ఖన్నా రేంజ్ పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలు అయినా రానటువంటి భారీ అవకాశాలు, రాశీ ఖన్నా కి ఇప్పుడు వస్తున్నాయి. ఇలాంటి అవకాశాలు ముందే వచ్చి ఉండుంటే ఈరోజు ఆమె రేంజ్ వేరే లెవెల్ లో ఉండేది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాశీ ఖన్నా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసింది కానీ, నెగెటివ్ రోల్ లో మాత్రం నటించలేదు. హిందీ లో తెరకెక్కిన ‘రుద్రా ‘ అనే వెబ్ సిరీస్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది కానీ, పూర్తి స్థాయి నెగెటివ్ క్యారెక్టర్ అయితే కాదు. కానీ అల్లు అర్జున్ , లోకేష్ కనకరాజ్ మూవీ లో ఆమె పూర్తి స్థాయి నెగెటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. మరి ఈ యాంగిల్ లో ఆమె ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper