America : అమెరికాలో రెప్పపాటులో మరో విమాన ప్రమాదం తప్పింది. మంగళవారం(ఫిబ్రవరి 25న) చికాగో(Chikago)లోని మిడ్‌వే విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా రన్‌వే(Runway) దాటుతున్న విమానం అప్పుడే వచ్చింది. దీంతో అంతా షాక్ అయ్యారు. కానీ, లాండ్ అవుతున్న విమానం మళ్లీ గాల్లోకి ఎగరడంతో ప్రమాదం తప్పింది. చికాగోలోని మిడ్‌వే మిమానాశ్రయం(Mid way airport)లో ఈ ఘటన జరిగింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలోని పైలెట్లు రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలోనే మరో విమానం రన్‌వేపై అడ్డంగా పరిగెత్తుతూ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్లు అప్రమత్తమయ్యారు. వెంటనే అదే రన్‌వేపై నుంచి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు ఎయిర్ పోర్టులోని కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనిని విమానాశ్రయ ప్రయాణికులు ఎక్స్‌లో పోస్టు చేశారు.
Also Read : మొన్న కాలిఫోర్నియా, నిన్న వాషింగ్టన్, నేడు ఫిలడెల్ఫియా.. అమెరికాలో ఒక్క నెలలోనే 3 పెద్ద విమాన ప్రమాదాలు
ఉదయం 9 గంటలకు..
చికాగోలోని మిడ్‌వే విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 9 గంటలకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోలో ప్రమాదం తృటిలో తప్పిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. పైలెట్లు(Poilets) చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగేది. పైలెట్లు అప్రమత్తతో ఈ రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రెండు ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టాయి. సదరు ఛాలెంజ్ 350 బిజినెస్ జెట్(Business Jet) ఎలాంటి అనుమతి లేకుండా ఒక్కసారిగా రన్‌వేపైకి వచ్చిందని ఎఫ్‌ఏఏ వర్గాలు తెలిపాయి.
అమెరికా రాజధాని వాషింగ్‌టన్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగేందుకు వస్తున్న పీఎన్‌ఏ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాన్ని హెలిక్యాప్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 67 మంది మరణించారు. తాజాగా ఘోర ప్రమాదం తృటిలో తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు