Homeఎంటర్టైన్మెంట్Jr NTR: ఎన్టీఆర్ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడా..? ఫైర్ అవుతున్న అభిమానులు...

Jr NTR: ఎన్టీఆర్ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడా..? ఫైర్ అవుతున్న అభిమానులు…

Jr NTR: ఇండియాలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప సినిమాలను చేసిన స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం పాన్ ఇండియాలో ఆయనకు అనుకున్నంత గుర్తింపైతే రాలేదు. కానీ సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా […]

Jr NTR: ఇండియాలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప సినిమాలను చేసిన స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం పాన్ ఇండియాలో ఆయనకు అనుకున్నంత గుర్తింపైతే రాలేదు. కానీ సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితేనే ఆయనకి భారీ మార్కెట్ క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం ఆయన భారీగా డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!

ఇక డ్రాగన్ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయనే ఇంకో రెండు సినిమాలకు కమిట్ అవ్వడం ఏంటి అంటూ మరికొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ సినిమా కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ మరో రెండు సంవత్సరాలలు బిజీ కానున్నాడు.

అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే కొత్త సినిమాలు కమిట్ అవ్వకుండా ఇంతకు ముందు ఒప్పుకున్న సినిమాల రిజల్ట్ ని బట్టి ఆ తర్వాత సినిమాలను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో అభిమానులైతే ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తనకు నచ్చిన కథలు ఎక్కడ మిస్ అయిపోతాయో అనే ఉద్దేశ్యంతోనే కొంతమంది దర్శకులకైతే ఓకే చెప్తున్నాడట. ప్రస్తుతం నెల్సన్ చెప్పిన కథ అతనికి బాగా నచ్చడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక తనతో పాటుగా రిషబ్ శెట్టి కూడా ఎన్టీఆర్ కి ఒక కథ ను వినిపించారట. దాంతో రిషబ్ శెట్టి తో సినిమా చేస్తున్నానని చెప్పినట్టుగా తెలుస్తుంది. రిషబ్ శెట్టి డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ప్రతి ఒక్కరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఈ సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ తొందరలోనే రాబోతుందట..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper