Maldives
Maldives: భారత్ దెబ్బ కొడితే మామూలుగా ఉండదు. స్నేహంగా ఉంటే.. ఎంత పెద్ద సాయానికైనా వెనుకాడదు. కానీ, మోసం చేయాలని చూస్తే మాత్రం ఆ దేశాలను వదిలి పెట్టదు. గతంలో పాకిస్తాన్ కూడా భారత్‌తో స్నేహం చేసినట్లు చేసి.. ఉగ్రవాదుల చొచబాట్లను ప్రోత్సహించింది. సైనిక స్థానవాలపై దాడలు చేయించింది. దీంతో కేంద్రం సర్జికల స్ట్రైక్స్‌తోపాటు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పాకిస్తాన్‌తోపాటు అది ప్రోత్సహించే ఉగ్రవాద సంస్థలు ఇబ్బంది పడ్డాయి. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింద. అప్పులపైనే ఆధార పడాల్సిన పరిస్థితి. ఇక గతేడాది మాల్దీవులు కూడా చైనా అండ చూసుకుని భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపింది. ఆ దేశంలోని సైనికులను పంపించింది. ఇక ఆ దేశ మంత్రులు అయితే ప్రధాని మోదీపై విమర‍్శలు చేశారు. దీంతో మోదీ.. మాల్దీవులను గట్టి దెబ్బ కొట్టారు. ఆయన స్వయంగా లక్ష్యద్వీప్‌కు వెళి.. భారత పర్యాలకులు లక్ష్య ద్వీప్‌కు రావాలని పిలుపు నిచ్చారు. మోదీ ప్రకటనను మల్దీవుల మంత్రులు ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతోపాటు భారత్‌తో పనిలేదు అన్నట్లు వ్యవహరించారు మహ్మద్ మెయిజ్జు.
తగ్గిన భారత పర్యాటకులు..
మోదీ కొట్టిన దెబ్బకు మల్దీవులు వెళ్లే భారత పర్యాటకులు గణనీయంగా తగ్గిపోయారు. 2023 వరకు మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో భారత్ మొదటి స్థానంలో ఉండేది. దౌత్య వివాదం నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లేవారు తగ్గిపోయారు. దీంతో 2024లో మాల్దీవులకు వెళ్లే పార్యటకుల దేశాల్లో భారత్ ఆరో స్థానానికి చేరింది. దీంతో ఆ దేశానికి ఆర్థిక ఇబ‍్బందులు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో మాల్దీవులు అధ్యక్షుడు మోయిజ్జు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
3 లక్షల మంది టార్గెట్..
2025లో భారత్ నుంచి 3 లక్షల మంది మాల్దీవులకు వచ్చేలా ఆ దేశం చర్యలు చేపట్టింది. ఈమేరకు లక్ష్యం నిర్దేశించుకుంది. ఈమేరకు భారతీయులను ఆకర్షించే చర్యలు చేపడుతోంది. భారత్‌లో నెలవారీ కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తోంది. ఈమేరకు మాల్దీవులు మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్‌్స కార్పొరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం ద్వారా పర్యాటకులు వస్తారని భావిస్తోంది. మొదటిసారి వీడియో ప్రకటనలు ఇవ్వడంతోపాటు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించాలని భావిస్తోంది. సమ్మర్ క్రికెట్ క్యాంపులకు ప్లాన్ చేస్తోంది.
విమానయా సంస్థలతో ఒప్పందం..
భారత్ నుంచి మాల్దీవులకు భారత్ నుంచి వీలైనంత ఎక్కువ మంది పర్యాటకులను తీసుకెళ్లేందుకు విమానయాన సంస్థలతో ఒప్పందం చేసుకుంటోంది. ఈ క్రమంలో కొత్తగా చెన్నై, పూణె, కోల్‌కతా తదితర నగరాల నుంచి విమన సర్వీస్‌లు నడుపనుంది. ఎలాగైనా గతేడాది కోల్పోయిన ఆదాయాన్ని ఈ ఏడాది పొందాలని భావిస్తోంది.
మోదీ దెబ్బకు..
మాల్దీవులకు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారనం నరేంద్రమోదీనే. గతేడాది ప్రారంభంలో లక్ష్యద్వీప్‌ను సందర్శించారు. సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీంతో మాల్దీవుల మంత్రులు మడిపడ్డారు. అక్కసు వెళ్లగక్కారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతీసే స్థాయికి చేరింది. అనేక మంది భారతీయులు మాల్దీవుల టూర్ రద్దు చేసుకున్నారు. దీంతో 2023లో 2.09 లక్షలుగా ఉన్న భారత పర్యాటకులు 2024లో 1.30 లక్షలకు పడిపోయారు. ఈ క్రమంలో మెయిజ్జు భారత్‌లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Reduced indian tourists the situation in the maldives is worse
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com