People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన గరివిడి లక్ష్మి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. బుర్రకథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. రాజా సాబ్ లాంటి ప్లాప్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకరకంగా ఆలోచనలో పడింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని గరివిడి లక్ష్మి సినిమాను తెరమీదకి తీసుకొచ్చింది ఈ సినిమా ప్రారంభం నుంచి చివరిదాకా ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని పెంచింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా నిర్మాణాన్ని ఒక ఉద్యమం లాగా చేపట్టేందుకు ముందుకు వచ్చింది. అందువల్లే తాను ఈ సంస్థను ప్రారంభించినట్టు టీజీ విశ్వప్రసాద్ అనేక సందర్భాలలో వెల్లడించారు. వంద చిత్రాలు నిర్మించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే వేగంతో సినిమాలను వరుసగా నిర్మించుకుంటూ వచ్చారు.. కొన్ని సినిమాలు ఆయన సంస్థ స్థాయిని నిలబడ్డాయి. మరికొన్ని సినిమాలు ఇబ్బందికరంగా మారాయి. మేకింగ్.. కథల ఎంపిక వంటి వ్యవహారాలలో నిర్మాణ సంస్థకు నిలకాడ లేదు అనే అభిప్రాయాలు వినిపించాయి. కొన్ని ప్రాజెక్టులలో దారుణమైన లోపాలు కనిపించిన నేపథ్యంలో విశ్వప్రసాద్ నిర్మాణ విధానాలను పూర్తిగా మార్చివేయాలని అనుకున్నారు. అంతేకాదు కొత్త దిశలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశ్వప్రసాద్ తన కుమార్తె కృతి ప్రసాద్ కు పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది.
కృతి ప్రసాద్ అమెరికాలో పెరిగారు. అక్కడే చదువుకున్నారు. వేగంగా గరివిడి లక్ష్మి లాంటి బుర్రకథ సాంప్రదాయ కళారూపం నేపథ్యమున్న సినిమాను రూపొందించారు. ఫలితంగా ఆ సినిమా స్థిరంగా కలెక్షన్లు వసలూ చేస్తోంది. గరివిడి లక్ష్మి సినిమా కమర్షియల్ ఫార్మాట్ కు పూర్తిగా దూరంగా ఉంది. భారీ స్టార్ ఎట్రాక్షన్ లేదు. హంగులు లేవు. ఆర్బాటలు అంతకంటే లేవు. ఒక జానపద కళాకారిణి జీవితంలో సంఘర్షణకు ఈ సినిమాలో ప్రాధాన్యం ఇచ్చారు. దర్శకుడు గౌరీ నాయుడు.. కథానాయక ఆనంది.. ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు..
వాస్తవానికి ఇలాంటి బయోపిక్ ను సినిమాగా రూపొందించాలి అంటే ధైర్యం ఉండాలి. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కు అవకాశం ఉండదు. అయినప్పటికీ కృతి ప్రసాద్ ఈ కథను ఎంచుకున్నారు. దర్శకుడికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. నిర్మాణ సహకారాన్ని అందించారు తద్వారా సినిమాను గొప్పగా మలిచారు. కృతి ఆలోచనలు ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి బలమైన ఆర్థిక నేపథ్యం ఉంది. బడ్జెట్ కేటాయింపు విషయంలో సంస్థ ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. దర్శకులకు అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు.. వారి దగ్గర నుంచి ప్రాపర్ అవుట్ పుట్ తీసుకోవడం కూడా ముఖ్యమే. అందువల్లే కృతి పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రికి తగ్గ కూతురని నిరూపించుకున్నారు. గరివిడి లక్ష్మి సినిమా ద్వారా సంస్థ గౌరవాన్ని మరింత పెంచారు. కృతి ప్రసాద్ వచ్చారు కాబట్టి సంస్థలో వెంటనే మార్పులు జరిగిపోతాయి అనుకోవడం కంటే.. మార్పులు మొదలయ్యాయి అని చెప్పడం ఉత్తమం. అయితే కృతి ప్రసాద్ వచ్చే రోజుల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఇతర సినిమాల్లో కూడా ఎంట్రీ ఇస్తారా.. లేదా తన అభిరుచికి తగ్గట్టు మాత్రమే సినిమాలు నిర్మిస్తారా.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి