Donald Trump Protests America: ఇరాన్‌పై యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట బయట విమర్శలు ఎదుర్కొంటునర్నాడు. తన సామ్రాజ్యవాద కాంక్షను చాటుకుంటున్నాడని పలువురు ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. ఇరాన్‌పై యుద్ధాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇలాంటిసమయంలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలపై దేశవ్యాప్తంగా ప్రజా ఆగ్రహం పెల్లుబికింది. ‘నో కింగ్స్‘ (రాజులు లేరు) అనే నినాదంతో అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ, ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారు. శనివారం జరిగిన ఈ నిరసనలు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్–డే ప్రదర్శనగా నిలిచే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు..
గతంలో జరిగిన రెండు ’నో కింగ్స్’ ఈవెంట్లకే లక్షలాది మంది హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగిందని అంచనా. చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈసారి నిరసనలో 70 లక్షలకు పైగా పాల్గొన్నట్లు అంచనా. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, మిన్నెసోటా, లాస్ ఏంజిలిస్‌తోపాటు ్ఢ అంతర్జాతీయ నగరాలు లండన్, పారిస్, రోమ్, బెర్లిన్‌లోనూ నిరసనలు మిన్నంటాయి.
నిరసనలకు ప్రధాన కారణాలు..
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సంస్కరణల పేరుతో వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. ఇవి రాజ్యాంగ పరిమితులను మీరుతున్నాయని, ప్రజాస్వామ్య సంస్థలపై దాడిగా భావిస్తున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో మాట్లాడుతూ, ‘గతంలో చాలామంది అధ్యక్షులు తమ రాజ్యాంగ పరిమితులను పరీక్షించారు, కానీ మన స్వేచ్ఛకు, భద్రతకు ఇంతటి ముప్పుగా ఎవరూ మారలేదు‘ అని వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మాస్ డిపోర్టేషన్లు, కుటుంబాల విడదీత వంటి అంశాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. వలసదారుల హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారు. ట్రంప్ విధించిన టారిఫ్లు, వాణిజ్య యుద్ధాలు అమెరికన్లపై ద్రవ్యోల్బణం భారం మోపాయి. ముఖ్యంగా ఐరోపా దేశాలపై విధించిన సుంకాలు అంతర్జాతీయ నిరసనలకు కూడా కారణమయ్యాయి. గ్రీన్లాండ్ విషయంలో డెన్మారŠైక్ప ఒత్తిడి తెచ్చేందుకు 8 ఐరోపా దేశాలపై భారీ టారిఫ్లు విధించడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ కార్యాలయంలో తీసుకున్న నిర్ణయాలతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తొలగించబడ్డారు. ఇది ఉద్యోగ భద్రతపై ఆందోళన రేకెత్తించింది.
దద్దరిల్లిన ప్రధాన నగరాలు..
మిన్నెసోటా రాజధాని సెయింట్ పాల్లోని స్టేట్ క్యాపిటల్ వద్ద సుమారు లక్ష మంది పాల్గొన్న భారీ ర్యాలీ నిర్వహించబడింది. ప్రముఖ గాయకుడు బ్రూస్ స్ప్రింగ్సీ్టన్, జోన్ బేజ్ ఈ ర్యాలీకి నాయకత్వం వహించారు. నిరసన కారులు వీధులను నింపేశాయి. నేషనల్ మాల్ వద్ద లక్షలాది మంది సమీకరించి, ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేస్తూ ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులను ప్రదర్శించారు. ‘అమెరికాలో రాజులు లేరు‘, ‘నిరంకుశత్వానికి లొంగేది లేదు‘ వంటి నినాదాలు మోగాయి. మిడౌన్ మాన్హాటన్లో వేలాది మంది వీధుల్లోకి చేరుకుని, ట్రంప్ టవర్ వద్ద నిరసన తెలిపారు. నగర కేంద్రంలోని ప్రధాన రోడ్లు నిరసన కారులతో నిండిపోయాయి. మేరీల్యాండ్లోని ఒక వృద్ధాశ్రమం బయట చక్రాల కుర్చీల్లో ఉన్న వృద్ధులు కూడా ‘నిరంకుశత్వాన్ని ఎదిరించండి‘ అంటూ బోర్డులతో నిరసన తెలిపారు. ఇది ఉద్యమం యొక్క విస్తృతిని చాటిచెబుతోంది. లండన్, పారిస్, రోమ్, బెర్లిన్ వంటి ఐరోపా నగరాల్లోనూ, లాటిన్ అమెరికా దేశాల్లోనూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఇది కేవలం అమెరికా సమస్య కాకుండా, ప్రపంచ ప్రజాస్వామ్యవాదుల ఆందోళనగా మారింది.
స్పందించిన వైట్ హౌస్..
నిరసనలపై వైట్ హౌస్ స్పందించింది. ఈ నిరసనలు ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని, ఇవి దేశ ప్రయోజనాలకు విరుద్ధమని కొట్టిపారేసింది. ట్రంప్ స్వయంగా ఏఐ సాంకేతికతతో తయారు చేసిన వీడియోల ద్వారా నిరసనకారులను హేళన చేశారు. కానీ ఈ ప్రతిస్పందన నిరసనకారుల ఆగ్రహాన్ని మరింత రేకెత్తించింది. ‘ప్రజల గొంతుకను అణిచివేయలేరు‘ అని నిర్వాహకులు స్పష్టం చేశారు.
చరిత్రాత్మక ప్రాధాన్యం
2017లో ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన విమెన్స్ మార్చ్ నిరసనలో 50 లక్షల మంది పాల్గొన్నారు. 2020లో జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత జరిగిన బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. 2025–26లో నో కింగ్స్ పేరుతో జరిగిన నిరసనల్లో 70 లక్షలకు పైగా పాల్గొనడంతో ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్–డే నిరసనగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిరసనలు 2026 మిడ్‌టర్మ్ ఎన్నికలపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇది గట్టి షాక్ ఇచ్చింది. ప్రజా వ్యతిరేకతను అధిగమించలేకపోతే, 2028 అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ పరిస్థితి కష్టతరం కావచ్చు.
’నో కింగ్స్’ నిరసనలు అమెరికా ప్రజాస్వామ్యం ఇంకా బలంగా ఉందనడానికి నిదర్శనం. ప్రజలు తమ గొంతుక వినిపించుకునే హక్కును ఉపయోగించుకున్నారు. ట్రంప్ పరిపాలనా విధానాలు మారకపోతే, ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.