Homeఅంతర్జాతీయంIran Seven Conditions To End War: యుద్ధం ముగింపునకు ఇరాన్‌ ఏడు కండీషన్లు.....

Iran Seven Conditions To End War: యుద్ధం ముగింపునకు ఇరాన్‌ ఏడు కండీషన్లు.. అమెరికా అంగీకరిస్తుందా?

Iran Seven Conditions To End War: ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. మొదలు పెట్టిందికానీ, ముగింపు అమెరికా చేతిలో ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఐదు రోజులు విరామం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. కానీ, ఇరాన్‌ చర్చలు జరగడం లేదని, తమకు భయపడే ట్రంప్‌ విరామం ప్రకటించారని తెలిపింది. తాజాగా యుద్ధం ముగించేతి తామే అని, అందుకు తమ డిమాండ్లు అంగీకరించాలని ఏడు కండీషన్లు పెట్టింది. […]

Iran Seven Conditions To End War: ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. మొదలు పెట్టిందికానీ, ముగింపు అమెరికా చేతిలో ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఐదు రోజులు విరామం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. కానీ, ఇరాన్‌ చర్చలు జరగడం లేదని, తమకు భయపడే ట్రంప్‌ విరామం ప్రకటించారని తెలిపింది. తాజాగా యుద్ధం ముగించేతి తామే అని, అందుకు తమ డిమాండ్లు అంగీకరించాలని ఏడు కండీషన్లు పెట్టింది. ఇవి సైనిక, ఆర్థిక, భౌగోళిక ప్రాధాన్యతలపై ఆధారపడి, శాంతి చర్చలకు సవాల్‌గా మారాయి.

Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా స్తుతి.. వీడియో వైరల్

డిమాండ్లు ఇవీ..
ఇరాన్‌ ప్రధాన డిమాండ్లు పరిశీలిస్తే.. గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా మూసివేయాలి, భవిష్యత్‌ దాడులకు హామీలు ఇవ్వాలి, ఇజ్రాయెల్‌–హిజ్బుల్లా దాడులు పూర్తిగా ఆపాలి. ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి, యుద్ధ నష్టాలకు (సుమారు 1200 మంది మరణాలు) పరిహారం చెల్లించాలి. క్షిపణి కార్యక్రమంపై ఎటువంటి పరిమితులు విధించొద్దు. హార్మూజ్‌ జలసంధి రవాణా ఓడల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలుకు అనుమతించాలి అని తెలిపింది. ఈ షరతులు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మెజ్తాబా ఖమేనీ, అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ మద్దతుతో రష్యా, పాకిస్తాన్‌ చర్చల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

అమెరికా–ఇజ్రాయెల్‌ అంగీకరిస్తాయా?
అమెరికా ఈ డిమాండ్లకు పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశం చాలా తక్కువ. గల్ఫ్‌లో 40 వేల మంది, అమెరికా సైనికులు ఉన్నారు. బహ్రెయిన్‌లోని 5వ ఫ్లీట్‌ మధ్యప్రాచ్య ప్రభావానికి కీలకం. ఇజ్రాయెల్‌ హెజ్బుల్లా దాడులు ఆపమనేది తీవ్ర వివాదాస్పదం. ఎందుకంటే ’ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’లో ఇరాన్‌ అణు–క్షిపణి సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ట్రంప్‌ యుద్ధం ముగించే దిశగా సిగ్నల్స్‌ ఇస్తున్నప్పటికీ, కాల్పుల విరమణ తాత్కాలికమని, హార్మూజ్‌ స్వయంగా తెరుచుకుంటుందని చెప్పారు.

గల్ఫ్‌ దేశాలపై ఒత్తిడి
ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలను (సౌదీ, యుఎఈ, బహ్రెయిన్, కువైట్‌) ఒత్తిడి చేస్తూ అమెరికా బేస్‌లు ఇవ్వకండని హెచ్చరిస్తోంది, లేకపోతే దాడులు జరుగుతాయని. ఇది గల్ఫ్‌ దేశాల్లో అయోమయం సృష్టించింది. వారి చమురు కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు లక్ష్యమవుతాయని భయం. ఇరాన్‌ పర్షియన్‌ గల్ఫ్‌లో సీ మైన్స్‌ అమరుస్తామని హెచ్చరించడం 1980ల అనుభవాలను గుర్తు చేస్తోంది. నాటి ఘటనలో 100 మైన్‌ స్వీపర్లు విఫలమయ్యాయి.

హార్మూజ్‌ జలసంధి ప్రభావాలు
ప్రపంచ చమురు రవాణాలో 20–30% హార్మూజ్‌ గుండా వెళ్తుంది, దీని మూసివేత లేదా ఫీజు వసూలు చమురు ధరలను పెంచుతుంది. భారత్‌కు 85% ముడి చమురు దిగుమతులు ఇక్కడి నుంచే జరుగుతుంది. చైనా, జపాన్, కొరియాపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇరాన్‌ దీనిని తన ’చట్టపరమైన పాలన’గా ప్రకటించి, ఆర్థిక బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది, కానీ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం.

ఇరాన్‌ డిమాండ్లు మొదట 3 ఉండగా, తర్వాత 6కు పెరిగాయి, ఇప్పుడు ఏడుగా మారాయి, ఇది బల ప్రదర్శనగా కనిపిస్తుంది. ట్రంప్‌ 48 గంటల డెడ్‌లై¯Œ ముగిసిన నేపథ్యంలో బీకర దాడులు జరిగే అవకాశం ఉంది. శాంతి సాధ్యమైతే మధ్యప్రాచ్య స్థిరత్వం పెరుగుతుంది, కానీ ఒప్పందం జరగకపోతే యుద్ధం దీర్ఘకాలం కొనసాగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper