Homeఅంతర్జాతీయంIndia warning to China border issue: చైనాకు భారత్ వార్నింగ్.. సరిహద్దుల్లో పెద్ద కుట్ర.....

India warning to China border issue: చైనాకు భారత్ వార్నింగ్.. సరిహద్దుల్లో పెద్ద కుట్ర.. ఈసారి ఏకంగా కొత్త దేశం ప్రకటన!

India warning to China border issue: భారత్‌ తరచూ మన భూభాగాలను ఆక్రమించేందుకు యత్నిస్తోంది. సరిహద్దులు మార్చి మ్యాపులు విడుదల చేస్తోంది. 2017లో డోక్లాం వద్ద ఆక్రమణకు యత్నించి, భారత సైన్యం చేతిలో తరిమికొట్టింది. బూటాన్‌ పాలకులను లోబర్చుకుని, సరిహద్దు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టింది. 2020లో గాల్వన్‌ లోయలో చొరబడే ప్రయత్నం చేసి, 20 మంది భారత సైనికుల ప్రాణాలు తీసింది. మూడేళ్ల పాటు సరిహద్దులో భారీ సైన్యాన్ని మోహరించి, ఉద్రిక్తతలు రేకెత్తించింది. కొత్త ఆక్రమణ […]

India warning to China border issue: భారత్‌ తరచూ మన భూభాగాలను ఆక్రమించేందుకు యత్నిస్తోంది. సరిహద్దులు మార్చి మ్యాపులు విడుదల చేస్తోంది. 2017లో డోక్లాం వద్ద ఆక్రమణకు యత్నించి, భారత సైన్యం చేతిలో తరిమికొట్టింది. బూటాన్‌ పాలకులను లోబర్చుకుని, సరిహద్దు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టింది. 2020లో గాల్వన్‌ లోయలో చొరబడే ప్రయత్నం చేసి, 20 మంది భారత సైనికుల ప్రాణాలు తీసింది. మూడేళ్ల పాటు సరిహద్దులో భారీ సైన్యాన్ని మోహరించి, ఉద్రిక్తతలు రేకెత్తించింది.

కొత్త ఆక్రమణ పేరు..
తాజాగా చైనా తన జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో సాన్లింగ్‌ అనే కొత్త కౌంటీని ఏర్పాటు చేసింది. ఇది పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే), ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో అక్సాయ్‌ చిన్‌లో అధిక భాగం ఉంది, ఇది 1962 యుద్ధం నుంచి చైనా ఆక్రమణలో ఉంది. భారత్‌ ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించి, ‘బుర్ర దగ్గరుంచుకుని పనిచేయాలి‘ అని హెచ్చరించింది.

సత్సంబంధాలు అంటూనే కుట్రలు..
చైనా భారత్‌తో సత్సంబంధాలు అంటూనే, సరిహద్దులో ఆక్రమణలు కొనసాగిస్తోంది. హిమాలయ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ, టిబెట్, భారత్‌ సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధించాలని యోచిస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌ నిర్మాణం కూడా భారత్‌కు పెను ముప్పుగా మారింది. అత్యవసర సమయాల్లో భారీగా నీటిని వదిలి కృత్రిమ వరదలు సృష్టించే ప్రమాదం ఉంది.

చైనా సమర్థన వివాదం
ఇలాంటి చర్యలు చేస్తున్న చైనాను భారత కమ్యూనిస్టు పార్టీలు సమర్థిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. చైనాలో ఉంటే ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తారు. ఇరాన్‌లోనూ కఠిన చర్యలు ఉంటాయి. కానీ భారత ప్రజాస్వామ్యంలో చర్యలు లేకపోవడంతో, చైనా, పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చేవారు బహిరంగంగానే తిరుగుతున్నారు.

భారత్‌ ప్రతిచర్య..
భారత్‌ చైనా చర్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ చైనా తీరును పూర్తిస్థాయిలో తప్పుబట్టింది. సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రత్యేక రాయబారులను నియమించి, చర్చలు జరుపుతోంది. 2024 అక్టోబర్‌లో ప్యాట్రోలింగ్‌ అమరికలపై ఒప్పందం కుదిరినా, చైనా ఆక్రమణ ధోరణి మారలేదు.

చైనా కుట్రలు కొనసాగుతూనే ఉంటాయి. సరిహద్దులో భారీ సైన్యాన్ని మోహరించి, మౌలిక సదుపాయాలు పెంచుకుంటోంది. భారత్‌ కూడా తన సైనిక సన్నద్ధతను పెంచుకుని, దృఢ వైఖరితో ఉండాలి. అంతర్గతంగా దేశద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జాతీయ భద్రత ప్రాధాన్యత ఇవ్వాలి. చైనా అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper