Homeఅంతర్జాతీయంGTA 6 PC Review: పీసీలో ఎప్పుడు వస్తుంది? గ్రాఫిక్స్, డిస్ ప్లే ఎలా ఉండబోతున్నాయంటే..

GTA 6 PC Review: పీసీలో ఎప్పుడు వస్తుంది? గ్రాఫిక్స్, డిస్ ప్లే ఎలా ఉండబోతున్నాయంటే..

GTA 6 PC Review: GTA 6 PC గురించి గేమింగ్ అభిమానులలో భారీగా ఆసక్తి నెలకొని ఉంది. అద్భుతమైన గ్రాఫిక్స్.. ఓపెన్ వరల్డ్.. కార్లు.. యాక్షన్ మిషన్లు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ గేమ్ పై అంచనాలు ఉన్నాయి. అయితే ముందుగా ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. అక్టోబర్ 16 నాటికి రాక్ స్టార్ గేమ్స్ అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ బీసీ వెర్షన్ కు లేదు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ నవంబర్ […]

GTA 6 PC Review: GTA 6 PC గురించి గేమింగ్ అభిమానులలో భారీగా ఆసక్తి నెలకొని ఉంది. అద్భుతమైన గ్రాఫిక్స్.. ఓపెన్ వరల్డ్.. కార్లు.. యాక్షన్ మిషన్లు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ గేమ్ పై అంచనాలు ఉన్నాయి. అయితే ముందుగా ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. అక్టోబర్ 16 నాటికి రాక్ స్టార్ గేమ్స్ అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ బీసీ వెర్షన్ కు లేదు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ నవంబర్ 19. కాగా, ప్లే స్టేషన్ 5, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్ ఎస్ వెర్షన్లకు సంబంధించింది.

గ్రాఫిక్స్ విజువల్స్

వైస్ సిటీ నగరంలోని నియాన్ లైట్లు.. రోడ్లు.. వాహనాలు.. వాతావరణం అంటే అంశాలు గేమ్ కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పిసి వెర్షన్ లో అధిక గ్రాఫిక్స్ సెట్టింగులు వస్తే మరింత మెరుగైన విజువల్స్ చూసే అవకాశం ఉంటుంది.

ఓపెన్ వరల్డ్ గేమ్ ప్లే

నగరంలో స్వేచ్ఛగా తిరగడం.. వాహనాలు నడపడం.. మిషన్లు పూర్తి చేయడం.. కథలోని పాత్రలతో ప్రయాణించడం అంటే అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశం ఉంది.

జేసన్, లూసియా కథ

జేసన్, లూసియా జీవితాల్లో జరిగే సంఘటనలు.. లేరా ప్రపంచంతో ముడిపడిన కథ ఈ గేమ్ కు కేంద్ర బిందువు. కథలోని మిషన్లు.. పాత్రల మధ్య సంబంధాలు.. ఆటగాలను ఆకట్టుకునే అవకాశం ఉంది.

నవంబర్ 19 తర్వాత

ప్రస్తుతం రాక్ స్టార్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం కన్సోల్ వెర్షన్లు నవంబర్ 19 తర్వాత విడుదల కాబోతున్నాయి. పిసి వెర్షన్ కు సంబంధించిన అధికారిక తేదీ ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ఇటీవల కొన్ని గేమింగ్ మీడియా కథనాలు పిసి వెర్షన్ 2027 మొదటి మూడు నెలల్లో రావచ్చని పేర్కొన్నాయి. అయితే ఈ సమాచారం అధికారికంగా ధ్రువీకరించలేదు. కాబట్టి 2027 విడుదలను కేవలం ప్రస్తుతానికి అంచనాగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంటుంది.

  • ప్రస్తుతం GTA 6 కోసం కొత్త పీసీ కొనాలి అనుకుంటే, అధికారిక సిస్టం అవసరాలు వచ్చేవరకు వేచి చూడాలి.
  • ఇప్పటికే గేమింగ్ పీసీ ఉంటే.. మీ ప్రాసెసర్.. గ్రాఫిక్ కార్డ్స్..RAM వివరాలను బట్టి అప్ గ్రేడ్ చేయాలి.
  • అనధికారిక GTA 6 PC డౌన్ లోడ్ లింకులు..APK లు లేదా, ఎర్లీ యాక్సెస్ పేరుతో వచ్చే ఫైళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • విడుదల తేదీ.. ధర.. పిసి వెర్షన్ వివరాల కోసం Rockstar games అధికారిక GTA 6 వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper