Nepal Crisis: నేపాల్ దేశంలో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. సామాజిక మాధ్యమాల మీద నిషేధ విధించారు అనే కారణంతో అక్కడ యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రైవేటు ఆస్తులను కూడా వదిలిపెట్టడం లేదు. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు చాలావరకు గృహాలకే పరిమితమవుతున్నారు. ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఆందోళనకారుల వల్ల అక్కడ పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. ఇప్పటికే అక్కడి ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. మంత్రులు కూడా రాజీనామా చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు.
నిప్పటించారు
గొడవలతో అట్టడుకుతున్న నేపాల్ లో ప్రజాప్రతినిధులను, మాజీ మంత్రులను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆంక్షలను లెక్క చేయడం లేదు. కర్ఫ్యూను పట్టించుకోవడం లేదు. భద్రతా బలగాలను లెక్కచేయడం లేదు. ఆస్తుల విధ్వంసంలో కూడా వెనకడుగు వేయడం లేదు. నేపాల్ రాజధానిలో మాజీ ప్రధానమంత్రి ఖానాల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఆమె సతీమణి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మంటల వల్ల చనిపోయినట్టు సమాచారం. ఈ ఘటన కంటే ముందు నేపాల్ ప్రధానమంత్రి వ్యక్తిగత నివాసం పై కూడా ఆందోళనకారులు దాడులు చేశారు. దీంతో అక్కడ రాజకీయంగా సంక్షోభం ఏర్పడింది.
సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతోనే దేశంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయని.. నిరసనలు వ్యక్తమవుతున్నాయని.. అవి కాస్త హింసాత్మకంగా మారాయని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా వస్తున్న వారసత్వం పై కూడా నిరసనలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా నేపాల్ దేశంలో మొదలైన అల్లర్లను నెపోకిడ్ మూమెంట్ గా అభివర్ణిస్తోంది. ఏకంగా పార్లమెంట్లోకి నిరసనకారులు దూసుకువెళ్లారు అంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంతర్జాతీయ మీడియా తన కథలను చెబుతోంది. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర, మాజీ అధ్యక్షుడు పుష్పకమల్, మంత్రి పృద్వి, హోం శాఖ మాజీ మంత్రి రమేష్ వంటి వారి ఆస్తుల మీద నిరసనకారులు దాడులు చేశారు. ఇక ఆర్థిక శాఖ మంత్రి ప్రసాద్ ను వీధుల వెంట పరుగులు పెట్టించి దాడి చేశారు. మాజీ ప్రధానమంత్రి బహదూర్, ఆయన సతీమణి దేవు బాలపై దాడి చేసి గాయపరిచినట్టు నేపాల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
BREAKING: Protesters burst into the residence of Nepal’s corrupt Foreign Minister Arzu Rana Deuba and beat her and her family. pic.twitter.com/jamjagiMYx
— World Source News 24/7 (@Worldsource24) September 9, 2025