Nepal Gen Z Protest : నేపాల్ పరిణామాలు ఊహకందనంతగా సాగిపోతున్నాయి. ప్రధానమంత్రి ఓలీ రాజీనామా.. దుబాయికి పారిపోవడం.. మాజీ ప్రధానులపై దాడులు.. మాజీ ప్రధాని భార్య సజీవదహనం.. పార్లమెంట్, సుప్రీంకోర్టుపై దాడి.. ఆర్థిక మంత్రిపై పబ్లిక్ గా తన్నుకుంటూ తరమడం.. జైలు గోడలు బద్దలు కొట్టి మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రవి లమిచాన్ ను విడుదల చేసుకొచ్చారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి చెందిన నేత.
మీడియా, వ్యాపారవర్గాలపై దాడులు జరుగుతున్నాయి. చరిత్ర చూస్తే.. 18వ శతాబ్ధంలో ప్యారిస్ కమ్యూనిటీ తిరుగుబాటు జరిగింది. ప్రతీవాళ్ల మీద దాడులు చేసి చంపేశారు. విప్లవాత్మక అరాచక ఘటన అని అనొచ్చు.
నేపాల్ జనంలో ఉన్న తీవ్ర అసంతృప్తి. రాజకీయ నేతలపై కసి. అందరూ దొంగలేనన్న కోపం ఈ దాడులకు కారణమైంది. దీనికి పరిష్కారం ఉందా? అంటే చెప్పలేం. అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుందా? లేదా? అన్నది చూడాలేం..
బాలేంద్ర షా అనే వ్యక్తి భారత్ లో చదువుకున్నాడు. భారత్ కు వ్యతిరేకమైన వ్యక్తినే. ఈయన ఖట్మాండు మేయర్. సోషల్ మీడియా దాడులకు ఈయనే కారణం. రవి మెలచా అనే వ్యక్తి కూడా కాబోయే ప్రభుత్వంలో భాగం కావచ్చు. మరో రాజకీయ అస్తిత్వానికి దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారత్ కు పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి అలర్ట్ కావాలి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.