Rama Rajamouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళుతున్న దర్శకుడు రాజమౌళి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ గుర్తింపును సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు చేశారు. అయితే 12 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. కానీ రాజమౌళి భార్య అయిన రామ మాత్రం రాజమౌళి చేసిన సినిమాల్లో సై, యమదొంగ సినిమాలు పెద్దగా ఆడలేదని అందులో యమదొంగ సినిమా అంటే తనకు అసలు నచ్చదని గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ముఖ్యంగా యమదొంగ సినిమాలో కొన్ని విషయాలు పెద్దగా ఇంపాక్ట్ ను ఇవ్వలేదని రాజమౌళి చేసిన సినిమాల్లో తనకు ఆ సినిమాలు అంటే అసలు నచ్చదని చెప్పింది. మొత్తానికైతే సై, యమదొంగ సినిమాలు ప్రొడ్యూసర్స్ కి పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదని చెప్పారు.
Also Read: లిటిల్ హార్ట్స్’ చిత్రానికి ముందు ‘మౌళి’ నెల సంపాదన ఎంతో ఉండేదో తెలుసా..?
ఇక రాజమౌళి సినిమాలన్నింటిలో ఈ రెండు సినిమాలు కొంతవరకు వెనుకబడిపోయాయని ఆమె చెబుతుండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి అనగానే అందరికీ భారీ సక్సెస్ లు మాత్రమే గుర్తుకొస్తాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమాతో కూడా మరోసారి భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక తొందరలోనే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ ను సైతం రిలీజ్ చేయాలని రాజమౌళి చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక దాంతో పాటుగా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ ని నవంబర్ నుంచి ప్రేక్షకులకు ఇస్తానని మాట ఇచ్చాడు. ఇంకా దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఫోటోలు గాని, వీడియోలు గాని ఎప్పటికప్పుడు లీకవుతూనే ఉన్నాయి. మరి దాని మీద ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది…