Minister Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh)కృషి ఫలించింది. ఆయన చొరవతో నేపాల్ నుంచి ఏపీ వాసులు క్షేమంగా బయలుదేరారు. నేపాల్ లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హింసతో నేపాల్ అట్టుడుకి పోతోంది. ఈ నేపథ్యంలో నేపాల్ వెళ్లిన తెలుగు ప్రజల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయ్యింది. నేపాల్ వెళ్లిన బాధిత కుటుంబాలు ఆందోళనతో ఉన్నాయి. ఈ తరుణంలో నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఢిల్లీలో ఏపీ భవన్ తో పాటు నేపాల్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నారు. నేరుగా బాధితులతో వీడియో కాల్ లో మాట్లాడుతూ తగు జాగ్రత్తలు సూచించారు. అక్కడ నుంచి స్వస్థలాలకు క్షేమంగా బయలుదేరేలా ఏర్పాట్లు చేయడంలో నరాల్లోకే సక్సెస్ అయ్యారు.
Also Read: నేపాల్ లో 215 మంది ఏపీ పౌరులు.. రంగంలోకి లోకేష్
* రోజంతా సచివాలయంలోనే..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న క్రమంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ పేరుతో అనంతపురంలో కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించింది. అయితే ఆ సభకు మంత్రి నారా లోకేష్ వెళ్లలేదు. సచివాలయంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ చర్యలు ఫలించి నేపాల్ లో చిక్కుకున్న తెలుగు ప్రజలు స్వదేశానికి పయనం అవుతున్నారు. నేపాల్ లో 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని ఏపీకి రప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. తొలివిడతగా నేపాల్ లోని హెటౌడా నుంచి 22 మంది ఏపీ వాసులను సురక్షితంగా బీహార్ సరిహద్దు ప్రాంతాలకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఏపీకి రప్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తమను క్షేమంగా తీసుకురావడంపై ఏపీ ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
* ప్రత్యేక విమానం సిద్ధం..
మరోవైపు ఖాట్మండు( khatmond ) పరిసరాల్లో ఉన్న 173 మందిని తరలించేందుకు గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్లనుంది. అక్కడ కర్ఫ్యూ సడలించిన వెంటనే ఏపీకి బయలుదేరనుంది. మిగతా 173 మందిని విశాఖ, విజయవాడ తరలించేలా ఏర్పాటు చేశారు. నిన్ననే నేపాల్ లో చిక్కుకున్న వారితో మంత్రి నారా లోకేష్ వీడియో కాల్ లో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి క్షేమంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.+91 98183 95787 నంబర్ను అందుబాటులో ఉంచారు. 24 గంటలు సేవలందించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ అక్కడ కొనసాగుతోంది. నేపాల్ లో చిక్కుకున్న బాధితులు నేరుగా సంప్రదించే వీలుగా ఏర్పాట్లు చేశారు.