Suryakumar Yadav Asia Cup 2025: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో విడుదలైన ఓ సినిమాలో ఓ నటుడు ప్రతి నాయకుడిని హెచ్చరించే క్రమంలో తన చేతిని చూపిస్తాడు. చూసావా ఎంత రఫ్ గా ఉందో అంటూ భయపడతాడు. అప్పట్లో ఈ సన్నివేశం బహుళ ప్రజాధరణ పొందింది. సాధారణంగా ఇటువంటి సన్నివేశాలకు అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. కాకపోతే నిజ జీవితంలో ఇలాంటి సన్నివేశాలు అరుదుగా చోటు చేసుకుంటాయి. అటువంటిదే మంగళవారం యూఏఈ వేదికగా జరిగింది.
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఆసియా కప్ సాగుతోంది. తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ కంటే ముందు ఈ టోర్నీలో ఆడే 8 జట్ల సారథులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారి వారి ప్రణాళికలను ప్రకటించారు. తమ జట్టు సభ్యుల ఆటతీరు.. గతంలో సాధించిన విజయాలు.. భవిష్యత్తు కాలంలో రూపొందించుకునే ప్రణాళికలు.. వీటన్నిటి గురించి చెప్పారు. అయితే ఇందులో టీమిండియా కెప్టెన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. జట్టు గేమ్ ప్లాన్.. ఇతర విషయాల గురించి భారత జట్టు సారథి మాట్లాడుతున్నప్పుడు నిండైన ఆత్మవిశ్వాసం కనిపించింది. జట్టుకూర్పు విషయంలో తాము ఎలాంటి కసరత్తు చేసామో భారత జట్టు నాయకుడు వివరిస్తున్నప్పుడు ఇతర జట్ల కెప్టెన్లు కూడా ఆసక్తిగా విన్నారు. వాస్తవానికి టీమిండియా సారథి మాట్లాడుతున్నంత సేపు పాకిస్తాన్ కెప్టెన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంత గేమ్ ప్లాన్ పెట్టుకొని వచ్చిన తర్వాత తాము కనీసం పోటీ అయిన ఇస్తామా అన్నట్టుగా అతని ముఖంలో హావ భావం కనిపించింది.
విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ వేదిక నుంచి కిందికి దిగి వచ్చాడు. అతడు దిగివస్తుండగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మోహిసిన్ నఖ్వీ, పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ ఆఘా ఎదురయ్యారు. సూర్యకుమార్ యాదవ్ కు వారు షేక్ అండ్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది సేపటి వరకు అలానే ఉండిపోయారు. సూర్య కుమార్ యాదవ్ ఏం చేశాడో తెలియదు గానీ.. మొత్తానికి రఫ్ హ్యాండ్ అనుభూతి పొంది ఉంటారని టీమ్ ఇండియా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ గేమ్ ప్లాన్ గురించి చెప్పాడు. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు ఎంత ఆసక్తిగా ఉన్నాడో చెప్పాడు. దీనిని బట్టి టీమిండియా దూకుడు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. దానికంటే ముందు సూర్య కుమార్ యాదవ్ శాంపిల్ చూపించాడు. ఇక పాకిస్తాన్ ప్లేయర్లకు క్రొకోడైల్ ఫెస్టివల్ అని” టీమ్ ఇండియా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Captain Suryakumar Yadav handshake with Pakistan’s interior minister Mohsin Naqvi who recently gave India a threat after Operation Sindoor.
In right side pic Suryakumar Yadav handshake with Pakistan Captain during Asia Cup press conference pic.twitter.com/JWuDGl5A2B
— Jeet (@JeetN25) September 9, 2025