Japan Airlines Boeing 737: ఈ దేశం, ఆదేశం అని తేడా లేదు.. ప్రపంచప్తంగా ఏదో ఒకచోట విమాన ప్రమాదాలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా భారీగా చోటుచేసుకుంటున్నది. అందువల్లే విమానయానం అంటే చాలామంది భయపడుతున్నారు. విమానాలలో ప్రయాణించాలంటే వణికి పోతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల.. వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల వల్ల విమానాలు విఫలమవుతున్నాయి. ప్రమాదాలకు గురవుతున్నాయి. తద్వారా ప్రాణ నష్టం తోపాటు ఆస్తి నష్టం భారీగా చోటు చేసుకుంటున్నది. ఇక ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ప్రమాదం వల్ల 200 మందికి పైగా ప్రయాణికులు కన్నుమూశారు. ఓ మెడికల్ కాలేజీ మీద ఆ విమానం కూలడంతో ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. ఇక ఆ ప్రమాదం తర్వాత అంతర్జాతీయ ప్రాంతాలకు వెళ్లే విమానాలలో తరచూ సాంకేతిక సమస్యలు చోటు చేసుకోవడం.. సర్వీసులను నిలిపివేయడం వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా జరిగాయి.
Also Read:
మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా విమానాలలో సమస్యలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా షాంగై నుంచి టోక్యో వెళ్తున్న జపాన్ దేశానికి చెందిన ఎయిర్ లైన్స్ బోయింగ్ 737 విమానం లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఆ విమానం ఆకాశం పై నుంచి అకస్మాత్తుగా కిందికి దిగింది. కేవలం 10 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరగడం విశేషం. క్యాబిన్ లో ప్రైజెరేషన్ సమస్య వల్ల ఆక్సిజన్ మాస్క్ లు ఒక్కసారిగా విడుదలయ్యాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సమయంలో పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఒసాకా ప్రాంతంలోని కన్సాయ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా భూమిని చేరుకున్నారు.
Also Read:
అయితే ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. విమానాన్ని తనిఖీ చేసినప్పుడు అంత బాగానే ఉందని.. గాలిలో ఎగిరినప్పుడే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని తెలుస్తోంది.. విమానంలో సాంకేతిక సమస్య ఎదురవడంతో ఒక్కసారిగా పైలట్ తన చాకచక్యాన్ని ప్రదర్శించాడు. ఎమర్జెన్సీ సంకేతాలను సమీపంలో ఉన్న విమానాశ్రయానికి పంపించాడు. అప్పటికప్పుడు ఒసాకా విమానాశ్రయంలో అధికారులు ఏర్పాటు చేయడంతో విమానం దిగడానికి అవకాశం ఏర్పడింది. దీంతో విమానాన్ని వెంటనే పైలెట్ ల్యాండ్ చేశాడు. ఆక్సిజన్ మాస్క్ లు విడుదల కావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ” ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒకసారిగా విమానం పైనుంచి కిందికి వచ్చింది. ఆక్సిజన్ మాస్క్ లు రావడంతో మాలో ఆందోళన కలిగింది. ఆ తర్వాత ఒసాకా విమానాశ్రయంలో ఫ్లైట్ దిగడంతో సిబ్బంది మాకు అసలు విషయం చెప్పారు. పునర్జన్మ లభించినట్టు అయింది. విమాన ప్రయాణం సులభంగా జరుగుతుందనుకున్నాం కానీ.. ఇలా అవడం మా దురదృష్టమని.. ప్రాణాలు నిలబడటం అదృష్టమని” ప్రయాణికుల పేర్కొంటున్నారు.
36 వేల అడుగుల నుంచి 26 వేల అడుగులకు అకస్మాత్తుగా పడిపోయిన విమానం
షాంగై నుంచి టోక్యో వెళ్తున్న జపాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 విమానం (ఫ్లైట్ JL8696/IJ004)లో సాంకేతిక లోపం కారణంగా 36 వేల అడుగుల ఎత్తు నుంచి 10,500 అడుగులకు 10 నిమిషాల్లో పడిపోయింది. క్యాబిన్ ప్రెజరైజేషన్ సమస్య వల్ల… pic.twitter.com/kWkY7evVJ0
— ChotaNews App (@ChotaNewsApp) July 3, 2025